Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇండియాలో ముస్లింలకు రక్షణ లేదన్న మాజీ ఉపరాష్ట్రపతి అన్సారీ వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. అంత అభద్రత భావం ఉంటే వేరే దేశం వెళ్లిపోవచ్చని ఆరెస్సెస్ నేత ఇంద్రేష్ కుమార్ ఆయనకు సలహా ఇచ్చారు. ప్రపంచంలో ముస్లింలకు ఇండియా కంటే ఎక్కువ భద్రత కల్పించే దేశమేదో చెబితే.. మిగతా అభద్రతా భావంలో బతుకుతున్న ముస్లింలు కూడా ఆయన్ను అనుసరిస్తారని వంగ్య వ్యాఖ్యలు చేశారు.
నూట ఇరవై ఐదు కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో ఎక్కడో జరిగిన చిన్న సంఘటనను భూతద్దంలో చూపించి.. ఇండియాలో ముస్లింలకు రక్షణ లేదని ఓ ఉపరాష్ట్రపతి లాంటి కీలక పదవి చేపట్టిన వ్యక్తి మాట్లాడటం కంటే దారుణం మరొకటి లేదన్నారు. ఎన్నో దేశాల్లో భారత్ రాయబారిగా పనిచేసిన అన్సారీ కనీస దౌత్యమర్యాద కూడా పాటించకుండా సొంత దేశం గురించి దారుణంగా మాట్లాడుతున్నారని ఆరెస్సెస్ మండిపడుతోంది.
ఆరెస్సెస్ అంతలా ఆక్రోశించడానికి కారణం ఉంది. ఈ మధ్యకాలంలో గోరక్షకులపై దాడులు మరుగునపడ్డాయి. మళ్లీ అన్సారీ వాటిని కెలికే ప్రయత్నం చేయడం దానికి నచ్చడం లేదు. దీనికి తోడు ప్రపంచంలో చాలా ముస్లిం దేశాల నుంచి జనం భారత్ కు వలస వస్తున్నారు. అంత రక్షణ లేకపోతే వాళ్లందరూ ఎందుకు వస్తున్నారని ఆరెస్సెస్ నిలదీస్తోంది.
మరిన్ని వార్తలు:
మోడీ మాట బాబా చెప్పారా..?