Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్లో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ వసూళ్లను రాబట్టింది. సినిమా విడుదలకు ముందు ఈ చిత్రం నిడివి సినిమాకు మైనస్ అవుతుందని అంతా భావించారు. కాని ఆశ్చర్యంగా అంత లెంగ్త్ ఉన్నా కూడా ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మర్థం పట్టారు. సినిమాలో మ్యాటర్ ఉంటే నిడివి ఎంత ఉన్నా పర్వాలేదు అని ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. అయితే సినిమా ఇంత నిడివి ఉన్నా కూడా అయిష్టంగా చాలా సీన్స్‌ను తొలగించినట్లుగా చెప్పుకొచ్చారు. ఆ సీన్స్‌ను అలాగే వదిలేయడం ఇష్టం లేని చిత్ర యూనిట్ సభ్యులు సినిమా ప్రమోషన్ కోసం ఆ సీన్స్‌ను విడుదల చేయడం జరిగింది.
మూడు కీలక సన్నివేశాలను చిత్రం నుండి తొలగించడం జరిగింది. ఆ సీన్స్ ఉండి ఉంటే సినిమా స్థాయి మరింతగా పెరిగేది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా అసెంబ్లీ సన్నివేశాలు మరియు ఎడ్యుకేషన్‌కు సంబంధించిన సీన్స్‌ను ఉంచి ఉంటే బాగుండేది అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇక రైతుతో సీఎంగా మహేష్‌బాబు మాట్లాడిన మాటలు కూడా చాలా ఆసక్తికరంగా సాగాయి. ఆ సీన్ ఉంటే కూడా తప్పకుండా సినిమాకు ప్లస్ అయ్యేది. ఏది ఏమైనా సినిమా అన్నప్పుడు కొన్ని సీన్స్‌ను తొలగిస్తూనే ఉండాలి. అవి ఎంత బాగున్నా కూడా ఎడిటింగ్‌లో తొలగించేస్తారు. అయితే ఇక్కడ మంచి సీన్స్‌ను తొలగించారనే బాధ సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో వ్యక్తం అవుతుంది.