మహేష్‌కే దక్కని అరుదైన రికార్డు గోవిందుడి సొంతం!

Geetha Govindam movie sets a new record

విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా పరుశురామ్‌ దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మించిన ‘గీత గోవిందం’ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా 110 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను రాబట్టి రికార్డుల వర్షం కురిపించిన ఈ చిత్రం కలెక్షన్స్‌ పరంగా నిర్మాతకు పంట పండివ్వడం జరిగింది. నిర్మాతకు ఈ చిత్రంతో ఏకంగా 55 కోట్ల కంటే ఎక్కువగా లాభాలు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ చిత్రంను తమిళనాడులో పంపిణీ చేసిన  డిస్ట్రిబ్యూటర్‌ షాక్‌ అయ్యే వసూళ్లు నమోదు అయ్యాయి. తెలుగు సినిమాలు తమిళనాడులో విడుదల అయితే కోటి అంతకు అటు ఇటుగా వసూళ్లను రాబడతాయి. తెలుగు వర్షన్‌లో అక్కడ సినిమా చూసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.

Geetha-Govindam

‘బాహుబలి’ చిత్రం మాత్రమే తెలుగు వర్షన్‌లో ఇప్పటి వరకు 5 కోట్లను క్రాస్‌ చేసింది. తాజాగా ‘గీత గోవిందం’ చిత్రం 5 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను తమిళనాట దక్కించుకుని రికార్డు సృష్టించింది. ఇంత భారీ వసూళ్లు నమోదు అయిన కారణంగా తమిళనాట డిస్ట్రిబ్యూట్‌ చేసిన డిస్ట్రిబ్యూటర్‌కు లాభాల వర్షం కురిపిస్తుంది. మహేష్‌బాబు సినిమాలకు తమిళనాట మంచి క్రేజ్‌ ఉంటుంది. ఇప్పటి వరకు మహేష్‌ నటించిన చిత్రాల తెలుగు వర్షన్‌లు రెండు మూడు కోట్ల వరకు వసూళ్లు రాబట్టాయి. కాని విజయ్‌ దేవరకొండ మాత్రం ఏకంగా 5 కోట్లను రాబట్టం సంచలనంగా చెప్పుకోవచ్చు. ఈ చిత్రంకు తమిళనాట నాన్‌ బాహుబలి రికార్డు దక్కింది. ఇంకా కూడా ఈ చిత్రం మంచి వసూళ్లతో దూసుకు పోతున్న కారణంగా ముందు ముందు మరెన్ని రికార్డులను ఈ చిత్రం దక్కించుకుంటుందో అంటూ ట్రేడ్‌ విశ్లేషకులు వ్యాఖ్యలు చేస్తున్నారు.

Geetha-Govindam

మహేష్‌కే దక్కని అరుదైన రికార్డు గోవిందుడి సొంతం! - Telugu Bullet