Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గొడవ ఏదైనా పోసాని నోట్లో నోరు పెట్టడానికి ఎవరైనా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు. కానీ పోసాని మాత్రం ఎదుటి వారు ఎంతటివారైనా లెక్క లేకుండా ఢీకొంటారు. ఒకప్పుడు గురువు గారు అంటూ దాసరిని ఏకిపారేసిన పోసాని ఇప్పుడు లోకేష్ ని తాగి మాట్లాడుతున్నావా అంటూ పెద్ద తేనెతుట్టెనే కదిలించాడు. అయితే ఈ పరిణామం అంతా ఊహించినట్టు గాకుండా ఇంకో మలుపు తీసుకుంది. వైసీపీ నాయకుడు, సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు అనూహ్యంగా పోసాని వ్యవహారాన్ని అనవసర రాద్ధాంతం గా కొట్టిపారేశారు. అయినా నంది అవార్డుల్లో కులాల ప్రస్తావన ఏంటని తప్పుబట్టారు. అవార్డులు రానివాళ్లు ఏదో ఒక్కటి చెప్పి ఇలా గొడవ చేయడం మాములే అన్నారు.
ఘట్టమనేని వ్యాఖ్యలకు పోసాని కౌంటర్ ఇవ్వడం సర్వసాధారణంగా జరిగిపోవాల్సింది. కానీ పోసాని గొంతు ఇంకా పెగల్లేదు. తాను అభిమానిస్తున్న జగన్ పార్టీలో నాయకుడు కావడం వల్ల ఆదిశేషగిరిరావు ని పోసాని ఏమీ అనలేకపోతున్నారా అన్న డౌట్ వస్తోంది. ఏదో ఒక ఒత్తిడి లేకపోతే సీఎం కొడుకుని, ఓ రాష్ట్ర మంత్రిని పట్టుకుని తాగి మాట్లాడుతున్నావా అన్న పోసానికి ఘట్టమనేని బదులు ఇవ్వడం ఓ లెక్క కాదు. కానీ పోసాని గొంతు పెగలడం లేదంటే తెర వెనుక ఏదో ఎపిసోడ్ ఉండి ఉంటుంది. అదేమిటో, ఆ అంతుబట్టని లెక్క ఏమిటో బయటపడేదాకా వేచి చూడాల్సిందే.