జంటనగరాల్లో అత్యంత వైభవంగా బోనాల పండుగ నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని పాడి పరిశ్రమలశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. గురువారం నుంచి గోల్కొండ బోనాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. జంటనగరాల్లో జరిగే బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి మంగళవారం సచివాలయంలోని హోంమంత్రి మహమూద్ అలీ చాంబర్‌లో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో దేవాదాయ, రెవెన్యూ, పర్యాటక, సాంస్కృతిక శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.