Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Gorantla Challenges Vundavalli To An Open Debate on Pattiseema
అనుకోకుండా పొలిటికల్ స్క్రీన్ పై దర్శనమిచ్చిన మాజీ ఎంపీ ఉండవల్లి.. పట్టిసీమ వేస్టని తీవ్ర విమర్శలు చేశారు. కానీ దీనికి కౌంటర్ గా టీడీపీ నుంచి అలిగారనుకుంటున్న నేత బదులివ్వడం పసుపు క్యాడర్ లో ఆనందం నింపింది. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ తర్వాత పెద్దగా మాట్లాడని గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఇప్పుడు పనిగట్టుకుని ఉండవల్లికి కౌంటర్లు వేశారు. పట్టి సీమ ప్రాజెక్టు గురించి బాగా వివరించిన గోరంట్ల.. జలవనరుల అధికారులతో కలిసి ప్రెస్ మీట్ పెట్టడం ఇంకా చర్చనీయాంశమైంది.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి అలక వీడటమే కాకుండా.. ఏకంగా జలవనరుల అధికారులతో సమీక్షించి మరీ ఉండవల్లికి బదులివ్వడం హాట్ టాపిక్ అయింది. పట్టిసీమ వృథా అని ఉండవల్లి వాదిస్తే.. పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టాలో పంటలు పండేవి కాదని, ఇప్పటికీ కృష్ణా బేసిన్లో నీళ్లు రావడం గగనంగా ఉందని, పట్టిసీమకు నీళ్లిచ్చాక కూడా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి గోదావరి జలాలు వృథాగా పోయాయన్న విషయం గుర్తుంచుకోవాలని ఘాటుగా రియాక్టయ్యారు గోరంట్ల.
ఉండవల్లి విమర్శించినా తమకు మంచే చేశారని, గోరంట్ల మళ్లీ సీన్లోకి వచ్చారని గోదావరి నేతలు తెగ సంతోషపడుతున్నారు. దీంతో ఉండవల్లికి పచ్చివెలక్కాయ పడ్డట్లైంది. తనకు జగన్ సూచించిందేంటి.. తాను చేసిందేంటి అని ఆత్మవిమర్శ చేసుకునే పనిలో పడ్డారు. ఉండవల్లి వైసీపీలో చేరడానికే టీడీపీపై విమర్శలు చేస్తున్నారని తమ్ముళ్లు ఆగ్రహంగా ఉన్నారు. ఉండవల్లి ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్ రాకుండా చేయాలనే పట్టుదలగా ఉన్నారు.
మరిన్ని వార్తలు:
వైఎస్ ను కాపీ కొడితే సీఎం అయిపోతారా..?
నంద్యాల ఓటర్లు ఏమనుకుంటున్నారు..?