Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల రగడ కొనసాగుతుంది. నంది అవార్డుల జ్యూరీ చైర్మన్‌గా జీవిత వ్యవహరించిన విషయం తెల్సిందే. జీవిత తన సినిమాకు అన్యాయం చేశారని అంటూ గుణశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. మొన్నటి వరకు జీవిత అంటే చాలా గౌరవం ఉండేదని, ఆమె ఆ గౌరవంను కాపాడుకోలేక పోయారు అంటూ గుణశేఖర్ అన్నాడు. రాజకీయ లబ్ది కోసం, రాజకీయాల్లో గుర్తింపు కోసం తెలుగు దేశం పార్టీ నాయకులు చెప్పినట్లుగా, ప్రభుత్వం ఇవ్వమన్న వారికి జీవిత అవార్డులను ఇచ్చినట్లుగా గుణశేఖర్ ఆరోపించారు.
తెలుగు దేశం పార్టీలో జీవిత చేరబోతున్నట్లుగా నంది అవార్డులు ప్రకటించిన వెంటనే జీవిత చెప్పిన విషయం తెల్సిందే. ఆమె రాజకీయ లబ్ది పొందేందుకు వారికి అనుకూలంగా వ్యవహరించింది అంటూ గుణశేఖర్ ఆరోపించాడు. తెలుగు దేశం పార్టీలో జీవిత చేరతాను అంటూ చెప్పిన మాట వాస్తవమే. గుణశేఖర్ ఆరోపణలో నిజం ఉందని, న్యాయం ఉందని కొందరు గుణశేఖర్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఇక నంది అవార్డుల గురించి ప్రశ్నించిన వారిపై మూడు సంవత్సరాల బహిష్కరణ అనేది తప్పుడు నిర్ణయం అంటూ గుణశేఖర్ చెప్పుకొచ్చాడు. నంది అవార్డులపై ఎవరైనా విమర్శలు చేస్తే మూడు సంవత్సరాల వరకు వారి పేరును లేదా వారు చేసిన సినిమాను నంది అవార్డుల పరిశీనలోకి తీసుకోవడం జరగదు. ఇది నంది అవార్డుల నిబంధన. ఈ లెక్కన చూస్తే చాలా మంది పేర్లు వచ్చే నంది అవార్డుల పరిశీలనకు తీసుకోక పోవచ్చు.