Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
హిందీలో బిగ్‌బాస్ పది సంవత్సరాలుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా సూపర్ హిట్‌గా దూసుకు పోతుంది. బిగ్‌బాస్‌కు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తూ నెం.1 షోగా తీసుకు పోయాడు. ఇప్పుడు తెలుగులో ఎన్టీఆర్ హోస్ట్‌గా బిగ్‌బాస్ గత సంవత్సరం ప్రారంభం అయ్యింది. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించడంతో బిగ్‌బాస్‌కు మంచి క్రేజ్ వచ్చింది. అయితే రెండవ సీజన్‌కు ఆయన అందుబాటులో లేకుండా పోయాడు. వరుసగా త్రివిక్రమ్ మరియు రాజమౌళి దర్శకత్వంలో పెద్ద సినిమాలకు కమిట్ అయిన కారణంగా బిగ్‌బాస్ సీజన్ 2కు హోస్ట్‌గా వ్యవహరించడం తన వల్ల కాదని తేల్చి చెప్పాడు. దాంతో నిర్వాహకులు నానిని హోస్ట్‌గా ఎంపిక చేశారు. ఏమాత్రం బుల్లి తెర అనుభం లేని నాని ఈ షోను ఎలా నిర్వహిస్తాడని అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బుల్లి తెరపై ప్రేక్షకులను అలరించడం అంటే మామూలు విషయం కాదు. ప్రతి రోజు కాకున్నా, వారంలో రెండు రోజులే అయినా కూడా నాని ఆకట్టుకుంటాడు అనే నమ్మకం తక్కువ మందిలో ఉంది. హీరోగా ప్రస్తుతం మంచి క్రేజ్‌తో ఉన్న నానికి ఈ షో పెద్ద సవాల్ అని చెప్పుకోవచ్చు. ఒక వేళ షోను సమర్థవంతంగా నిర్వహించలేని పక్షంలో తీవ్ర స్థాయిలో ఆయన సినీ కెరీర్‌పై ప్రభావం పడే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బుల్లి తెరపై నాని ఆకట్టుకుంటే సినీ కెరీర్ మరింత ముందుకు వెళ్తుందని, ఒకవేళ షోతో హోస్ట్‌గా మెప్పించలేకపోతే మాత్రం హీరోగా ఆయన ప్రతిష్టకు కాస్త మసకబారడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. బిగ్‌బాస్ అనేది ప్రస్తుతం నాని మెడపై కత్తి అని, ఆయన దాంతో సరిగ్గా వర్క్ చేయకుంటే మెడ తెగడం ఖాయం అంటున్నారు.