Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రస్తుతం తెలుగు సినిమా ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ను ఎక్కువగా ఆశిస్తున్నారు. అలా అని మొత్తం సినిమాను కామెడీతో నింపేసినా కూడా సక్సెస్ అయ్యే పరిస్థితి లేదు. ఆరోగ్యకరమైన ఎంటర్టైన్మెంట్తో రెండు మూడు మంచి పాటలతో, కొన్ని లవ్ సీన్స్, కొన్ని ఎమోషన్ సీన్స్, కొన్ని సెంటిమెంట్ సీన్స్‌తో సినిమా ఉంటే అప్పుడు ఆ చిత్రం సక్సెస్ అవుతుందని ఇప్పటికే విడుదలై సక్సెస్ సాధించిన చిత్రాలు నిరూపించాయి. పైన చెప్పిన లక్షణాలన్ని ఉన్న చిత్రం ‘హౌరా బ్రిడ్జ్’. లవ్, ఎంటర్టైనర్, యూత్‌ఫుల్ ఎలిమెంట్స్ ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్న సినిమా అవ్వడంతో ‘హౌరాబ్రిడ్జ్’పై సినీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.
రాహుల్ రవీంద్రన్ మరియు ఛాందిని చౌదరి జంటగా యాదు దర్శకత్వంలో రూపొందిన ‘హౌరాబ్రిడ్జ్’ చిత్రం ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మరియు టీజర్లు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. పూర్తి స్థాయి వినోదాత్మకంగా రూపొందిన ఈ చిత్రంలో అన్ని రకాల ఎలిమెంట్స్ సమపాల్లలో ఉంటాయని, ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా దర్శకుడు యాదు చిత్రాన్ని తెరకెక్కించాడు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో తీవ్ర పోటీ ఉన్నా కూడా ఈ వారంలోనే సినిమాను విడుదల చేసేందుకు నిర్మాత డిసైడ్ అయ్యారు. పోటీ ఎంత ఉన్నా కూడా కంటెంట్ బాగుంటే తప్పకుండా సినిమాలు సక్సెస్ అవుతాయి అంటూ గతంలో పలు సినిమాలు నిరూపించాయి. అదే దారిలో ‘హౌరాబ్రిడ్జ్’ కూడా నిలుస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.