Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నందమూరి బాలకృష్ణ, పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్లో తెరకెక్కిన ‘పైసా వసూల్’ చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న సినిమా ఆడియో వేడుకను నిన్న ఖమ్మంలో నిర్వహించారు. వర్షం వచ్చినా కూడా వైభవంగా ఆడియో విడుదల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక ఆడియో వేడుకలో చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయడం జరిగింది. ట్రైలర్లో బాలయ్యలోని మరో యాంగిల్ కనిపిస్తుంది. మరీ మాస్‌గా, ఒక మదపటేనుగు మాదిరిగా బాలయ్య చేసిన నటనకు ఫ్యాన్స్ పిచ్చెక్కి పోతున్నారు.
ఈ చిత్రంలో బాలయ్య తేడాసింగ్‌గా కనిపించబోతున్నాడు. పేరుకు తగ్గట్లుగానే బాలయ్య తేడా పనులు చేస్తూ ఉంటాడని ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. చిత్రం ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్‌కు పిచ్చేకిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. అయితే సినీ విశ్లేషకులు మాత్రం సినిమా ఆడితే దుమ్ము దుమ్ముగా ప్రేక్షకుల ఆధరణ దక్కించుకుని, రికార్డు స్థాయి వసూళ్లు సాధిస్తుంది. ఒక వేళ బాలయ్య ఓవర్ యాక్షన్‌కు ప్రేక్షకులు సంతృప్తి చెందకుంటే, సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడం ఖాయం. పూరి సినిమాలు అన్ని కూడా అయితే సూపర్ హిట్ లేదంటే అట్టర్ ఫ్లాప్. అలాగే ఈ సినిమా ఫలితం ఏంటి అనేది కూడా ట్రైలర్ చూస్తుంటే అర్థం కావడం లేదు. తేడాసింగ్‌గా బాలయ్య సక్సెస్ సాధించేనా లేక దబ్బె పడేనా అనేది సెప్టెంబర్ 1న సినిమా విడుదల తర్వాత తేలిపోవడం ఖాయం.
మరిన్ని వార్తలు: