భారత వాయుసేనకు చెందిన ఓ పైలట్ తమ ఆధీనంలో ఉన్నట్లు పాక్ అధికారులు చెబుతోన్న వేళ భారత విదేశాంగ అధికార ప్రతినిధి సంచలన ప్రకటన చేశారు. భారత్‌కు చెందిన మిగ్-21 బైసన్ విమానం మిస్సింగ్ అయిందని అని ప్రకటించారు. ఈరోజు ఉదయం కశ్మీర్‌లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్ వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలు భారత గగనతలం పైకి దూసుకొచ్చే ప్రయత్నం చేశాయని భారత భద్రతా దళాలు వీటిని తిప్పికొట్టాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ తెలిపారు. ఈ క్రమంలో మిగ్-21 విమానాన్ని కోల్పోయామని వెల్లడించారు. పాక్ యుద్ధ విమానాన్ని భారత్ కు చెందిన రెండు మిగ్-21 విమానాలు వెంబడించాయని అందులో ఒకటి పాక్ యుద్ధ విమానాన్ని కూల్చివేయగా మరోటి మిస్సయిందని రవీశ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. మిగ్ పైలట్ తమ అదుపులో ఉన్నాడని పాక్ ప్రకటించానట్టు రవీశ్ తెలిపారు. ఈరోజు మధ్యాహ్నం ఎయిర్ వైస్ మార్షల్ ఆర్‌జీకే కపూర్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.