Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చిన్న జాగాలో ఇళ్లు కట్టేసి. దాన్ని పోర్షన్లు చేసి అద్దెకిచ్చి… ఆ అద్దెలతోనే హోమ్ లోన్ ఇన్ స్టాల్ మెంట్ కడుతున్నారు చాలా మంది ఇంటి యజమానులు. కానీ ఇకపై అలా కుదరకపోవచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా అద్దెలు తగ్గుతాయని అసోచామ్ సర్వే తెలిపింది. ఐటీ రంగం ఒడిదుడుకులే ఇందుకు కారణమని తేల్చింది. తగ్గుతున్న రిక్రూట్ మెంట్లు, పెరుగుతున్న పింక్ స్లిప్పులతో ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు.
అందుకే ఐటీ ఉద్యోగులు ఖర్చు తగ్గించుకుంటున్నారని, ముందుగా అద్దె తగ్గించాలని తమ ఓనర్స్ ను కోరుతున్నట్లు తేలింది. ఢిల్లీ, ముంబై, పూణె, నోయిడా, గుర్గావ్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లాంటి ఐఠీ కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. అన్నిచోట్ల కంటే పుణెలో 20 శాతం అద్దెలు తగ్గుతాయని, మిగతాచోట్ల పది నుంచి పదిహేను శాతం తగ్గించాల్సి వస్తుందని అసోచామ్ అంచనా. ముఖ్యంగా బెంగళూరులో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ ఓనర్లే స్వచ్ఛందంగా అద్దె తగ్గిస్తున్నారు.
రియల్ ఎస్టేట్ రంగం కుదేలు కావడం కూడా తక్కువ అద్దెలకు ఓ కారణమట. అంతకుముందు అద్దెలు గిట్టుబాటు కాకపోతే యజమానులు ఇళ్లు అమ్ముకునేవారు. కానీ ఇప్పుడు అక్కడ కూడా సరైన రేటు రావడం లేదు కాబట్టి… నెల తిరిగేసరికి ఎంతోకొంత ఆదాయం రావడమే బెటర్ అని తమ మైండ్ సెట్ మార్చుకుంటున్నారు. కానీ ఈ పరిణామాలు లగ్జరీ హోమ్స్ అద్దెల విషయంలోనేనని, సాధారణ మధ్యతరగతి జనాలకు వర్తించదని అసోచామ్ చావు కబురు చల్లగా చెప్పింది.
మరిన్ని వార్తలు
దత్తన్నకు అదను చూసి హ్యాండిచ్చిన కేసీఆర్
రాముడి లీల.. రామదాసు గోల