Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
“ విడవమంటే పాముకి కోపం, కరవమంటే కప్పకి కోపం “ అన్న నానుడి ఎలా ఉంటుందో దిగ్గజ దర్శకుడు రాజమౌళికి అనుభవంలోకి వచ్చింది. సినిమా తప్ప ఇంకో విషయం పట్టించుకోని రాజమౌళి ఈ మధ్య ఇంకో విషయంలో కూడా జనం నోళ్ళలో నానుతున్నాడు. అదే అమరావతి విషయంలో. రాజధాని డిజైన్ లలో సలహాలు, సూచనల కోసం రాజమౌళి సాయం కోరారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆయనకు పెద్దగా ఆసక్తి లేకపోయినా పదేపదే సీఎం అంతటి వ్యక్తి కోరడంతో అమరావతి ఆకృతుల్లో భారతీయ, ఆంధ్ర సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింబించేంచే కొన్ని సలహాలు ఇచ్చారు. ఈ వ్యవహారం అంతా రామసేతు నిర్మాణంలో ఉడత సాయం లాంటిదని తాను చిన్నవాడినని చెప్పకనే చెప్పాడు రాజమౌళి. రాజమౌళి డిజైన్ పనికాగానే ఇక అమరావతి సీన్ లో నుంచి పక్కకి వెళ్ళిపోతారు అనుకునే టైం కి వైసీపీ అధినేత జగన్ కి కోపం వచ్చింది.
అనంతపురం పాదయాత్రలో చంద్రబాబుకి అండగా నిలుస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ఓ యాక్టర్ గా సంబోధిస్తూ విరుచుకుపడ్డ జగన్ సీన్ లోకి రాజమౌళిని కూడా లాగారు. అమరావతిలో ఓ ఇటుక కూడా వేయని చంద్రబాబు దానిపై సినిమా తీయమని ఓ దర్శకుడుని పిలిచారని జగన్ కామెంట్ చేశారు. ఆ సినిమాలో తన పాత్ర , నారాయణ పాత్ర బాగా వుండాలని కూడా చంద్రబాబు కోరినట్టు జగన్ అన్నారు. చంద్రబాబు ఏమీ చేయకపోయినా ఈ యాక్టర్లు, దర్శకులు భలే చేస్తున్నారని మనలను నమ్మిస్తారు అని జగన్ చేసిన కామెంట్స్ లో పవన్ తో రాజమౌళిని కలిపేశారు. ఈ కామెంట్స్ మీద రాజమౌళి హర్ట్ అయ్యారట. అమరావతికి సంబంధించి తన పాత్ర ఎంత పరిమితమో చెప్పాక కూడా జగన్ ఇలా అనడం మీద రాజమౌళి ఫ్యామిలీ కూడా ఫీల్ అవుతోందట. నిజానికి రాజమౌళి లోక్ సత్తా అభిమాని. బీజేపీ తరపున ప్రచారం కూడా చేశారు. ఆయన్ని పట్టుకుని చంద్రబాబు గాటన కట్టేసేందుకు జగన్ ప్రయత్నించడం చాలా మందికి నచ్చడం లేదు. మొత్తానికి ఇలా చంద్రబాబు , జగన్ మధ్య రాజకీయాలకు నలిగిపోతున్నారు రాజమౌళి పాపం!.