Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ముద్రగడ పాదయాత్ర జరిగినా, జరగకున్నా ఇప్పటిదాకా సాగిన రగడ చూసి వైసీపీ అధినేత జగన్ చంకలు గుద్దుకుంటున్నారట. కిందటి ఎన్నికల్లో టీడీపీ కి ఓటేసిన కాపుల్లో చీలిక వస్తుందని జగన్ ఎన్నో ఆశలతో ఊహల్లో విహరించేస్తున్నారట. అయితే ఆయనకి పక్కాగా చెప్పాల్సిన లెక్కలు కొన్ని వున్నాయి. ఆయన అనుకున్నట్టు రెచ్చగొట్టగానే రెచ్చిపోడానికి కాపులు ఏమీ అమాయకులు కాదు. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆయన అనుకున్నట్టు ఒక్క కాపులే కాదు ఏ కులంలోనూ గంప గుత్తగా ఓట్లు వేయరు. అలాగే కిందటి ఎన్నికల్లో కాపులు వైసీపీ కి కూడా ఓటు వేశారు. ఇటు టీడీపీ కి కూడా ఓటు వేశారు. పార్టీ మీద , నాయకుడి మీద వున్న నమ్మకం చూసి ఓట్లు వేశారు గానీ కేవలం కులాన్ని చూసి ఓట్లు వేయడానికి వాళ్ళేమీ ఓట్ల లెక్కలు వేసుకునే నాయకులు కాదు సామాన్య జనం. వాళ్ళు కులాన్ని చూసి మాత్రమే కిందటి ఎన్నికల్లో ఓటు వేశారు అనుకునే వాళ్ళు ఈ కింద వాస్తవాల్ని కాస్త గమనించాలి. కిందటి ఎన్నికల్లో ఓటర్ల విజ్ఞతని చూడకుండా కేవలం కులం కోణం లో వారిని చూసే నాయకులకి షాక్ ఇచ్చే నిజాలు ఇవే. కాపులు కేవలం కులాన్ని చూసి ఓటు వేస్తాయారన్న భ్రమల్లో బతుకున్న జగన్ ఓ సారి కళ్ళు తెరిచి ఈ నిజాలు చూడు.
1 . దాదాపు 70 శాతం కాపు ఓటర్లు వున్న పిఠాపురంలో ఒక్క శాతం ఓట్లు కూడా లేని వర్మ, వైసీపీ అభ్యర్థి దొరబాబు మీద 5000 ఓట్లతో గెలవడం ఎలా సాధ్యమైంది. జగన్ అనుకుంటున్నదే నిజం అయితే అక్కడ వర్మకి డిపాజిట్ కూడా దక్కకూడదు.
2 . 60 శాతం కాపు ఓటర్లు వున్న పాలకొల్లులో చిరంజీవి ఎందుకు ఓడిపోయాడు ?
3 . 60 శాతం దాకా కాపులు వున్న రాజానగరం నియోజకవర్గంలో 10 శాతం ఓట్లు కూడా లేని సామాజిక వర్గానికి పెందుర్తి వెంకటేష్ రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎలా గెలిచాడు ?
4 . కాపులంతా పవన్ కళ్యాణ్ చెప్పాడని టీడీపీ కి ఓటు వేస్తే ఆ వర్గం ఓటర్లు 65 శాతం దాకా వున్న జగ్గంపేట, ప్రత్తిపాడు, కొత్తపేట నియోజకవర్గాల్లో వైసీపీ ఎలా గెలిచింది.
5 . తెలుగు దేశం పార్టీ 8 సార్లు గెలిచిన కుప్పం, హిందూపురం నియోజకవర్గాల్లో కమ్మ ఓటర్ల సంఖ్య కేవలం 5 శాతానికి లోపే.
ఇవన్నీ జీర్ణం అయినా కాకపోయినా కఠిన వాస్తవాలు జగన్ మోహన్ రెడ్డి గారు. ఒక్క ముద్రగడ మీరు చెప్పినట్టు వింటున్నంత మాత్రాన మొత్తం కాపులంతా మీ ఉచ్చులో పడరు. అది నిజం కాబట్టే ముద్రగడకి ఇన్ని పరాజయాలు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా ఒకవేళ కాపులకి రిజర్వేషన్ వచ్చినా ఆ ఫలం చంద్రబాబుకి దక్కకుండా ముద్రగడతో రాజకీయం నడిపిస్తున్నాం అని జగన్ అనుకుంటే పర్లేదు కానీ… తన రాజకీయ ప్రయోజనాల కోసం కాపులకి కుల ముద్ర వేయడం సరికాదు. వారికి కులాన్ని మించి సమాజాన్ని చూసే పరిణితి వుంది. పాలకుడుని నిర్ణయించే సత్తా వుంది. కాకుంటే అధికారం ఆశతో మీరే ఆ వాస్తవాన్ని చూడలేక కుప్పిగంతులు వేస్తున్నారు.
మరిన్ని వార్తలు