జయదేవ్‌ చిత్రం వల్ల ఇద్దరికి మేలు జరిగింది

jaidev movie helps for director and producer

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ హీరోగా ‘జయదేవ్‌’ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెల్సిందే. ఆ సినిమా రావడం అయ్యింది, పోవడం అయ్యింది. సినిమాకు భారీగా ప్రమోషన్‌ చేశారు. మంత్రి తనయుడు కావడంతో చిరంజీవి, అల్లు అర్జున్‌ ఇలా పలువురు సెలబ్రెటీలు సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌లో పాల్గొన్నారు. దాంతో భారీగానే పబ్లిసిటీ వచ్చింది. ఎంత పబ్లిసిటీ వచ్చినా ఏం లాభం సినిమాలో మ్యాటర్‌ లేనప్పుడు. సినిమా చూడాలంటేనే ఆ హీరో అదో రకంగా ఉన్నాడు. సరే చూద్దాం బాగుంటుందేమో అని భావించి వెళ్లిన ప్రేక్షకులకు తలనొప్పి తప్పదు. దాంతో జయదేవ్‌ భారీ డిజాస్టర్‌గా మిగిలింది. 

ఈ చిత్రాన్ని నిర్మించింది అశోక్‌. పేరుకు ఆయనే అయినా మొత్తం డబ్బు మంత్రి ఇచ్చాడు అనే టాక్‌ వినిపస్తుంది. దాదాపు 20 కోట్ల వరకు మంత్రి నుండి అశోక్‌కు ముట్టినట్లుగా తెలుస్తోంది. అందులో 17 నుండి 18 కోట్ల వరకు నిర్మాత సినిమా కోసం వాడేశాడు. అశోక్‌ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతను జయంత్‌ సి పరాన్జీకి అప్పగించాడు. మొత్తం మేకింగ్‌కు 12 కోట్లు నిర్మాత జయంత్‌కు అప్పగించాడు. అయితే జయంత్‌ సి పరాన్జీ కేవలం ఆరు కోట్లతోనే సినిమాను పూర్తి చేశాడు. మిగిలిన ఆరు కోట్లతో పాటు తన పారితోషికం మరో కోటి మొత్తంగా ఏడు కోట్లు జయంత్‌ సి పరాన్జీ ఖాతాలోకి వెళ్లి పోయాయి. గత కొంత కాలంగా జయంత్‌ సి పరాన్జీ అప్పుల్లో ఉన్నాడు. ఈ దెబ్బకు అప్పులన్ని సెటిల్‌ అయ్యినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో నటించిన రవికి ఒక్క శాతం కూడా లాభం లేదు. మళ్లీ సినిమా చేస్తాడో లేదో కూడా తెలియదు.

మరిన్ని వార్తలు

వర్మ దర్శకత్వంలో బాలయ్య…ఎన్టీఆర్ బయోపిక్