Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యాంగ్రీ యంగ్‌మన్ రాజశేఖర్ సుదీర్ఘ కాలం తర్వాత ఒక మంచి సక్సెస్‌ను దక్కించుకున్నాడు. చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న సక్సెస్ రాజశేఖర్‌కు ఎట్టకేలకు దక్కింది. దాంతో రాజశేఖర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు మరియు ఆయన సన్నిహితులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు. చిత్ర యూనిట్ సభ్యులు మొత్తం ప్రస్తుతం ఆనందంలో ఎగిరి గంతేస్తున్నారు. ఆ గంతేస్తున్న వారిలో నిర్మాత లేకపోవడం అందరిని ఆశ్చర్యంకు గురి చేస్తోంది. ‘గరుడవేగ’ చిత్రాన్ని నిర్మించింది కోటేశ్వరరాజు. ఈయన సినిమాను 10 కోట్ల లోపు నిర్మించేందుకు ముందుకు వచ్చాడు. కాని సినిమా బడ్జెట్ అంతకు అంతకు పెరిగి పోవడంతో ఆయన వామ్మో… అని తప్పుకున్నాడు. ఆయన పెట్టిన పెట్టుబడిని జీవిత, రాజశేఖర్‌లు ఇచ్చేసి ప్రాజెక్ట్‌ను సొంతంగా నిర్మించారు.
నిర్మాణ బాధ్యతలను పూర్తిగా జీవిత చూసుకున్నారు. అందుకే ఆడియో వేడుక సందర్బంగా 200 కోట్లు నష్టపోయాం. మరోసారి నష్టపోమని భావిస్తున్నా అంటూ రాజశేఖర్ ధీమాగా చెప్పుకొచ్చాడు. ఇటీవల జరుగుతున్న సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో నిర్మాత కోటేశ్వరరావు కనిపించక పోవడంతో చిత్ర నిర్మాతు తాజాగా క్లారిటీ ఇచ్చారు. సినిమా ప్రారంభంలో కొన్నాళ్లు మాత్రమే ఆయన నిర్మాతగా ఉన్నారు. బడ్జెట్ పెరగడంతో ఆయన తప్పుకున్నాడని, అయితే పేరు మాత్రం కంటిన్యూ చేస్తూ, ఆయన పేరు మీద తాము నిర్మించాము అంటూ జీవిత మీడియాకు చెప్పుకొచ్చింది.
ఆయన నిర్మాత కాదు కనుక సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు అంటూ జీవిత రాజశేఖర్‌లు క్లారిటీ ఇచ్చారు. వచ్చే లాభంలో ఆయనకు కొంత వాట ఇస్తున్నట్లుగా మాత్రం సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మొత్తానికి గరుడవేగపై నమ్మకంతో స్వయంగా జీవిత అంత బడ్జెట్ పెట్టి సాహసం చేసిందని చెప్పుకోవచ్చు. జీవిత, రాజశేఖర్‌లు చేసిన ప్రయోగం, ప్రయత్నం, సాహసం సక్సెస్ అయ్యింది. మంచి లాభాలను జీవిత అండ్ కో పొందుతున్నట్లుగా చెబుతున్నారు.