కడపలో కన్నాకి షాక్ !

Kanna Lakshmi Narayana Bus Yatra cancel

రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర పర్యటన చేపట్టారు. ప్రస్తుతం రాయలసీమలో పర్యటిస్తున్నారు. ఇటీవల కావలి పర్యటనలో ఆయనపై ఒకరు చెప్పు విసరగా, అనంతపురంలో కన్నా పర్యటనను అడ్డుకోవడానికి టీడీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ ఘటనలు మరువక ముందే కన్నా కడప జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది.

ఇవాళ కడప జిల్లా పర్యటనలో భాగంగా కన్నా ఒంటిమిట్టలో పర్యటించాలనుకున్నారు. రాజంపేట నుంచి ర్యాలీ నిర్వహించాలనుకున్నారు. ఐతే ఒంటిమిట్టలో కన్నాకు స్వాగతం పలకడానికి ఒక్కరు కూడా రాకపోవడంతో ఆయన అసహనానికి గురయ్యారు. ఒంటిమిట్ట పుణ్యక్షేత్రంలో కన్నా ఒంటరి అవ్వాల్సి వచ్చింది. చేసేదేమీ లేక ఒంటిమిట్ట కార్యక్రమాన్ని కన్నా రద్దు చేసుకున్నారు. మరో విశేషమేంటంటే కన్నా రాక సందర్భంగా పార్టీ కార్యకర్తలను తరలించేందుకు ఏర్పాటు చేసిన రెండు బస్సుల్లోనూ ఒక్కరంటే ఒక్కరు కూడా ఎక్కలేదు.