అప్పుడప్పుడూ బయటకు వచ్చి తానున్నానంటూ పళ్ళాలు, గరిటలతో నిరాహార దీక్షలు చ్జేస్తూ, ఇంకా బోర్ కొట్టినప్పుడు లేఖలు రాస్తూ ఉండే మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై లేఖాస్త్రం సంధించారు. రాష్ట్ర, ప్రజల బాగోగులు కోరేవారైతే ప్రత్యేక హోదా కోసం తన లాగే ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాలని కోరారు. అంతేకాదు, ఇతర పార్టీ నాయకులను ఆహ్వానించి, నాలాంటి వాడికి కూడూ కాస్త చోటు ఇస్తే నేను కూర్చుంటానని ముద్రగడ తన లేఖలో వ్యాఖ్యానించారు.
ప్రత్యేక హోదా కోసం రైలురోకో, రాస్తారోకోలు చేద్దామని, రాష్ట్ర ప్రయోజనాల కోసం మా కాపులందరం సహకరిస్తారని ఎన్నో నెలల కిందట తాను లేఖ రాస్తే చంద్రబాబు దానికి ఇంత వరకూ స్పందిన్చలేదని ఆయన ధ్వజమెత్తారు. ‘గత ఎన్నికల్లో రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు.. జాబు కావాలంటే బాబు రావాలన్నారు… తెలగ, ఒంటరి, కాపు కులాలకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీలు ఇచ్చారు… కేవలం రైతు రుణమాఫీ మాత్రం కమిటీల మీద కమిటీలు వేసి మమ అనిపించారని ఆయన విమర్శించారు. ధర్మపోరాట దీక్ష పేరుతో రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం మంచిదికాదని ఆయన పేర్కొన్నారు. అయితే ఈయన రాసిన లేఖ మీద నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు.