అధికారంలోకి వస్తే కరీంనగర్ పేరు మారుస్తాం – స్వామి పరిపూర్ణానంద

Karimnagar Name Change Swami Paripoornananda

స్వామి పరిపూర్ణానంద ఈ మధ్యే ఆధ్యాత్మికత నుండి రాజకీయాల్లోకి అడుగులు వేసి, బీజేపీ పార్టీ లో చేరిన విషయం విదితమే. రాబోవు ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రచారం అంతగా చేయకున్నా, సమయం చూసుకొని బీజేపీ పార్టీ లక్ష్యాలు, విలువలు అంటూ ప్రవచనాలు చెప్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణాలోని కరీంనగర్ లో బీజేపీ కి అత్యధిక మెజార్టీ లో ఓట్లు వస్తాయని, తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి వస్తే కరీంనగర్ పేరుని మార్చుతామని చెప్పారు. అంతేకాకుండా యువతకు లక్ష ఉద్యోగాలు ఇచ్చిన ఘనత బీజేపీ పార్టీ దే అని కొనియాడారు.కరీంనగర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల పోటీలో నిలబడుతున్న బండి సంజయ్ ఎంతో నీతివంతమైన నాయకుడని, అతన్ని గెలిపిస్తే కరీంనగర్ లో నీతివంతమైన పాలన సాధ్యం అవుతుందని ప్రజలకు హితవు పలికారు.

Swami-Paripoornananda

బండి సంజయ్ గెలుపు ఖచ్చితమని, అతని గెలుపుకోసం తెలంగాణ మొత్తం ఎదురుచూస్తుందని, ఆరోజు ఎంతో దూరంలో లేదని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే తెలంగాణ కోసం అమరులైన 1265 మంది అమరుల ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. స్వామి పరిపూర్ణానంద ఇంత చెప్తున్నా బాగానే ఉందిగానీ, కరీంగర్ లో బీజేపీ గెలుపు ఆశించడం వరకు కూడా పర్లేదు అని చెప్పొచ్చు కానీ, దేశవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కుంటున్న బీజేపీ పార్టీకి తెలంగాణ లో అనుకూల పరిస్థితులు అంతగా లేవనేది కూడా గమనించాల్సిన విషయమే. అంటువంటి పరిస్థితుల్లో స్వామి పరిపూర్ణానంద తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి రావడం, కరీంగర్ పేరు కూడా మారుస్తాం అనడం చాలామందికి హాస్యాస్పదంగా అనిపించకమానదు. బహుశా, స్వామి పరిపూర్ణానంద యోగి ఆదిత్యనాధ్ లా ఇమేజ్ సంపాదించుకుందాం అనుకున్నారేమో.

Paripoornananda-To-Enter-Po