నయా ట్రెండ్‌: కౌశల్‌ కోసం కౌశల్‌ ఆర్మీ షాకింగ్‌ నిర్ణయం…!

Kaushal Will Soon Appear On The Screen As Hero

తెలుగు బుల్లితెరపై ‘బిగ్‌బాస్‌’ కార్యక్రమం ఎంతటి సక్సెస్‌ను సాధిచిందో చెప్పనక్కర్లేదు. తాజాగా ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 2 కూడా ఆది నుండి మంచి రేటింగ్స్‌తో దూసుకుపోయింది. తాజాగా జరిగిన ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 2విజేతగా బుల్లితెర నటుడు కౌశల్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ‘బిగ్‌బాస్‌’ ఇంట్లో వాళ్లతో తరుచూ వివాదాస్పదం అయిన కౌశల్‌కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. కౌశల్‌ ఏది చేసినా కూడా మొదటి నుండి అనుకున్నట్టుగానే కౌశల్‌ ఆర్మీ అంటూ కౌశల్‌ అభిమానుల సైన్యం చివర వరకు కౌశల్‌ ముందుండి విజేతగా నిలబెట్టారు. అందుకు గాను కౌశల్‌ కూడా తాజాగా అభిమానుల కోసం ఒక కార్యక్రమంలో పాల్గోన్నాడు.

big-boss-koushal

ఒక సాదారణ టీవీ షో ద్వారా విపరీత అభిమానులను సొంతం చేసుకున్న కౌశల్‌ సినీ ఇండస్ట్రీలో ఎప్పటి నుండో కొనసాగుతున్నాడు. కానీ ఇదివరకు లేని విధంగా కౌశల్‌కు ఈ షో టర్నింగ్‌ పాయింట్‌గా మారింది. ఇకపోతే ఎప్పుడూ వర్కౌట్‌ చేస్తూ మంచి బాడీ బిల్డింగ్‌ చేసిన కౌశల్‌ను అభిమానులు హీరోగా చూడాలనుకుంటున్నారు. చాలా చిత్రాల్లో కేరక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించిన కౌశల్‌ త్వరలో హీరోగా వెండితెరపై కనిపించనున్నాడు. అయితే ఈ చిత్రాన్ని నిర్మించేది ఎవరో కాదు, ‘బిగ్‌బాస్‌’ షో ద్వారా కౌశల్‌ను అమితంగా ఇష్టపడుతున్న కౌశల్‌ ఆర్మీనే.

kaushal

అభిమానులంతా క్రౌడ్‌ఫండ్‌ను పోగుచేసి నాలుగు కోట్లతో కౌశల్‌ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ చిత్ర మిగతా విషయాలన్నీ త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నట్టుగా కౌశల్‌ ఆర్మీ చెబుతున్నారు. ఇటీవల కేవలం నిర్మాతలే కాకుండా కథ నచ్చితే కొంతమంది కలిసి సినిమాలను నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ నయా ట్రెండ్‌ కౌశల్‌ను కూడా వరించింది. కౌశల్‌ ఆర్మీ క్రౌడ్‌ఫండ్‌ నిర్ణయం సాదారణ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.