Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడిన మాటలు వైసీపీ అధినేత జగన్ కి సంగీతంలా వినిపిస్తోంది. ఢిల్లీ లో విలేకరులతో పిచ్చాపాటీగా మాట్లాడుతూ ఏపీ రాజకీయాల గురించి కెసిఆర్ మనసు విప్పారట. కుల ప్రభావం ఎక్కువగా వుండే ఏపీ లో వచ్చే ఎన్నికల్లో వైసీపీ కి 45 శాతం, టీడీపీ కి 43 శాతం, బీజేపీ కి 2 .6 శాతం, జనసేనకు 1 – 1 .2 శాతం ఓట్లు వస్తాయని కెసిఆర్ చెప్పారట. పైగా తన మిత్రుడు ఒకరు సర్వే చేసి మరీ ఈ లెక్కలు చెప్పారని కెసిఆర్ వివరించారు. పనిలోపనిగా పార్టీ నడపడం పవన్ కళ్యాణ్ వల్ల కాదని కూడా తేల్చేశారారట కెసిఆర్. ఒకప్పుడు చిరంజీవి విషయాన్ని గుర్తు చేసి ఆయనే పార్టీ ని బరువుగా ఫీల్ అయినట్టు చెప్పారు. ఈ మాటలు వైసీపీ శ్రేణులకు అమృతప్రాయంగా తోస్తున్నాయి. జగన్ అయితే ఏకంగా గాలిలో తేలిపోతున్నారట. అయితే ఇక్కడే ఓ చిక్కుంది. ఓ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేయాల్సిన అవసరం వుంది.
2014 ఎన్నికలకు ముందు కూడా పవన్ కళ్యాణ్ గురించి కెసిఆర్ ఇలాగే మాట్లాడారు. తెలంగాణాలో తెరాస, ఆంధ్రాలో వైసీపీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు ఇక జన్మలో సీఎం కాలేడని కూడా చెప్పారు కెసిఆర్. తాను, జగన్ ముఖ్యమంత్రులుగా అన్ని సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని చెప్పారు. అయితే జరిగిందేమిటో జగద్విదితమే. 2014 లో జగన్ కేవలం కెసిఆర్ మాటల్లోనే సీఎం అయ్యారు. ఇప్పుడు ఆ టోన్ మార్చి వైసీపీ కి 45 శాతం ఓట్లు వస్తాయని చెప్పడం ద్వారా జగన్ లో మళ్లీ ఆశలు రేకెత్తించారు కెసిఆర్. కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి. అదే ఫ్లాష్ బ్యాక్.
మరిన్ని వార్తలు