కృష్ణార్జున యుద్ధం రివ్యూ… తెలుగు బులెట్

Krishnarjuna Yuddham movie review
 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నటీ నటులు : నాని, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, రుక్స‌ర్ మీర్, బ్రహ్మాజీ, హరితేజ, నాగినీడు, మహేష్ విట్ట తదితరులు
ద‌ర్శ‌క‌త్వం : మేర్ల‌పాక  గాంధీ.
నిర్మాత‌లు :  సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది
సినిమాటోగ్ర‌ఫీ:  కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని
జోనర్ : యాక్షన్, కామెడీ 
డ్యూరేషన్ : 158 నిముషాలు

 

నేచ‌ర‌ల్ స్టార్ నాని హీరోగా ఈరోజు కృష్ణార్జున యుద్ధం` సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమా టైటిల్ రివీల్ అయినప్పటి నుండే సినిమాపై ఆస‌క్తి నెల‌కొంది. వరుస విజయాలతో, విభిన్న‌మైన క్యారెక్ట‌రైజేష‌న్స్‌ తో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని ఈ సినిమాలో  ద్విపాత్రాభినయం చేయడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. 
 

‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ ‘ఎక్స్ప్రెస్ రాజా’ లాంటి సూపర్ హిట్లు కొట్టిన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నానీ సరసన టాలీవుడ్ క్యూటీ అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ దిల్లాన్ కథానాయికలుగా నటించారు. ఇక సినిమాని ముందే చూసిన దిల్ రాజు సినిమా మీద పాజిటివ్ టాక్ వినిపించడంతో సినిమా మీద మరింత అంచనాలు పెంచినట్టు అయ్యింది. అయితే ఈ సినిమా అంచనాల మేర ప్రేక్షకులని ఆకట్టుకుందా లేదా అనేది లోపలి వెళ్లి చూద్దాం.

కధ :

చిత్తూరు జిల్లాలోని అక్కుర్తి అనే ఒక మారుమూల పల్లెటూరిలో జులాయిగా తిరుగుతుంటాడు కృష్ణ (నాని 1). అమ్మాయిల వెంట పడటం వారు ఛీ కొట్టడం కామన్ అయిపోయింది అనుకున్న సమయంలో సిటీ నుండి వస్తుంది రియా(రుక్స‌ర్ మీర్) ఆమె ప్రెసిడెంట్(నాగినీడు) మనవరాలు ఆమె తో ప్రేమలో పడతాడు కృష్ణ. ఇదే సమయంలో మరో పక్క యూరప్ లో భారత సంతతికి చెందిన రాక్ స్టార్ అర్జున్  (నాని 2). అమ్మాయిలతో కూల్ గా ఎంజాయ్ చేయడం అతని హాబీ. అనుకోకుండా కలిసిన సుబ్బలక్ష్మి(అనుపమ పరమేశ్వరన్ ) తో ప్రేమలో పడతాడు.

ఇలా సాగిపోతున్న సమయంలో అర్జున్ మీద కోపం తో సుబ్బలక్ష్మి, తాత బలవంతంగా పంపించి వేస్తే రియా ఒకే సారి హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ అయితే చేరుకుంటారు కాని  ఇళ్ళకి మాత్రం చేరరు. వారి కోసమే హైదరాబాద్ చేరుకున్న అర్జున్-కృష్ణలు వారి కోసం వేరు వేరుగా వెతుకుతూ ఉంటారు. అసలు అర్జున్ – కృష్ణ లు కలుసుకున్నారా ? సుబ్బలక్ష్మి-రియా లు ఏమయ్యారు ?, అర్జున్ – కృష్ణ లు వారిని కలుసుకున్నారా ?  అర్జున్ ని అసహ్యించుకునే సుబ్బలక్ష్మి తిరిగి అర్జున్ ని చేరుకుందా ? అనేది తెర మీద చూడాల్సిందే. 

 విశ్లేషణ : 

కృష్ణ గా, అర్జున్‌ గా రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న త్రల్లో నాని తన స్థాయి నటనతో మరోసారి మెస్మరైజ్ చేశాడు. రెండు పాత్ర‌లు, వారి మ‌ధ్య సీన్లు రాసుకున్న విధానం ఆక‌ట్టుకుంది. నాని రెండు పాత్ర‌ల్లోనూ చ‌క్క‌గా సరిపోయాడు. నాని స్టైల్  డైలాగులు, నాని కామెడి టైమింగ్, యాక్షన్‌ ఎపిసోడ్స్ తో ప్రేక్షకుల్ని బాగానే ఎంటర్‌టైన్ చేశాడు. ఫస్టాఫ్ మొత్తం మంచి గ్రిప్పింగ్‌తో కథ నడిచినా సెకండాఫ్ తేలిపోయింది. ఫ‌స్టాఫ్‌ ఆసక్తికరమైన సన్నివేశాలతో బాగానే ఆకట్టుకొంది. అలాగే అక్కడక్కడ కొన్ని  కామెడీ సీన్ల‌తో సినిమా డీసెంట్ గా నడిచింది. 
 

ఇంటర్వెల్ బ్లాక్ ఆసక్తికరంగా ఉండి సెకండ్ హాఫ్‌పై ఆస‌క్తిని పెంచినా దాన్ని ద‌ర్శ‌కుడు కంటిన్యూ  చేయలేకపోయాడు. ఇక అనుపరమేశ్వరన్ క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంది, మరో హీరోయిన్ రుక్సర్ దిల్లాన్ తన పరిధి మేరకు బాగానే నటించింది. ఇక సినిమాకు బ్యాచ్క్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన బలం అనే చెప్పాలి. తమిళ సంగీత దర్శకుడు హిప్‌హాప్‌ రెండు పాటల మినహా మిగతా వాటితో తలనొప్పి తెప్పించారు. పాటలన్నింటిలో ‘దారిచూడు దుమ్ము మామ’ సాంగ్‌  ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. ఓవ‌రాల్‌గా చూస్తే కామన్ ఆడియన్స్ కి న‌చ్చే ఈ సినిమా కొత్త‌ద‌నం కోరుకునే వారికి మ‌రీ అంత‌గా న‌చ్చ‌క‌పోవ‌చ్చు. ఇప్పుడు ఉన్న నాని ఫామ్‌ను బ‌ట్టి చూస్తే సినిమా యావ‌రేజ్‌గా ఉన్నా హిట్ అయిపోతోంది. 

ప్లస్ పాయింట్స్ :

నాని యాక్షన్
స్క్రీన్ ప్లే,
బ్యాక్ గ్రౌండ్ స్కోర్,
నాని చిత్తూరు స్లాంగ్, లోకేషన్స్ 
కామెడి.

మైనస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్,
రెండు పాటల మినహా మిగతా సాంగ్స్,
రొటీన్ కధ.

తెలుగు బులెట్ పంచ్ లైన్ … కృష్ణార్జునులు అదరకోట్టేశారు.

తెలుగు బులెట్ రేటింగ్ … 3 /5 .