బీజేపీకి మరో షాక్… రేవణ్ణ ప్రెస్ మీట్ !

Kumaraswamy and Revanna press meet in Karnataka

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

కర్ణాటక ఎన్నికల్లో అంతా ఊహించినట్టే హంగ్ ఏర్పడింది. కానీ కింగ్ మేకర్ గా నిలుస్తుంది అనుకున్న జేడీఎస్… ఇప్పుడు ఏకంగా తానే కింగ్ గా అవతరించనుంది. బీజేపీని ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార పీఠంపై కూర్చోనివకుండా చేయాలన్న కాంగ్రెస్ పంతంతో తమకే ఎక్కువ సీట్లు వచ్చినా సీఎం పీఠంపై కుమారా స్వామిని కుర్చోబెట్టడానికి సిద్దమయ్యింది. అయితే అధికార పీఠానికి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయిన బీజేపీ… ప్రభుత్వ ఏర్పాటుకు సాధ్యమైన ఏ మార్గాన్ని వదలడం లేదు ఇందులో భాగంగా జేడీఎస్ లో చీలికలు తెచ్చి… కాంగ్రెస్ తో ఆ పార్టీ జతకట్టడాన్ని దెబ్బ కొట్టాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణను పావుగా వాడుకోవాలని చూస్తోంది. రేవణ్ణ వెనకాల దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఆయన 12 మంది ఎమ్మెల్యేలతో తమకు మద్దతు ఇస్తున్నారని కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలాను కలిసిన బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప ప్రకటించారు.

అయితే జేడీఎస్ లో చీలిక వస్తుందనే ఊహాగానాలకు నేడు జరిగిన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఫుల్‌స్టాప్‌ పెట్టారు. జేడీఎస్ అధినేత దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో పార్టీని వీడుతారన్న వదంతులకు తెరదించుతూ ఆయన నేడు కుమారస్వామితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తామంతా ఒక్కటేనని, తమలో చీలిక లేదని రేవణ్ణ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. తనను జేడీఎస్ శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు చెప్పారు. మత విద్వేషాలు రెచ్చకొట్టి బీజేపీ 104 స్థానాల్లో గెలుపొందిందని చెప్పారు. ఏ పార్టీకి మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీతో కలవాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.100 కోట్లు ఆఫర్ చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ వైపు రాకపోతే ఇన్కమ్ టాక్స్ రైడ్ లు వంటివి చేయిస్తామని కేంద్రప్రభుత్వ సంస్థలతో తమ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బీజేపీని నిరోధించేందుకు తాము కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తామన్నారు.