లక్ష్మీస్‌ డైరెక్టర్‌ ఓవర్‌ యాక్టింగ్‌

Lakshmi Parvathi Fires On Kethireddy Over Lakshmi's Veera Grandham

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

లక్ష్మీ పార్వతి జీవిత చరిత్రను చూపిస్తాను అంటూ ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ అనే చిత్రాన్ని కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి మొదలు పెట్టిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌ను వివాహం చేసుకోక ముందు లక్ష్మీ పార్వతి వీరగ్రంథం అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. అతడి నుండి ఎందుకు విడిపోయింది, ఎన్టీఆర్‌తో వివాహం తర్వాత అతడు ఏమయ్యాడు అనే విషయాలను కేతిరెడ్డి తన సినిమాలో చూపిస్తాను అంటూ మొదటి నుండి చెబుతున్నాడు. అందుకోసం గ్రౌండ్‌ నుండి రీసెర్చ్‌ చేసి స్క్రిప్ట్‌ను సిద్దం చేసుకున్నాడు. తాజాగా షూటింగ్‌ కార్యక్రమాలు కూడా ప్రారంభం అయ్యాయి. అయితే ఈ సినిమాకు లక్ష్మీ పార్వతి అనుమతించేందుకు నో చెప్పింది. ఇప్పటికే ఏపీ మరియు తెలంగాణ డీజీపీలకు లక్ష్మీ పార్వతి లేఖలు రాయడం జరిగింది.

lakshmi

 

తన అనుమతి లేకుండా కేతిరెడ్డి సినిమా తీస్తున్నాడని, ఆయన సినిమాకు అనుమతించొద్దు అంటూ విజ్ఞప్తి చేసింది. ఈ సమయంలోనే కేతిరెడ్డి కూడా ఏపీ డీజీపీని కలిసి లక్ష్మీ పార్వతి నన్ను చంపేస్తాను అంటూ బెదిరిస్తుందని, ఆమె నుండి తన ప్రాణాలకు హాని ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. తన ప్రాణాలకు ఏ హాని జరిగినా కూడా అది లక్ష్మీ పార్వతి వల్లే అంటూ ఆయన పేర్కొన్నాడు. అయితే ఈ విషయంపై లక్ష్మీ పార్వతి మరియు ఆమె సన్నిహితులు స్పందించారు. ఇప్పటి వరకు ఆయనతో నేరుగా మాట్లాడినది లేదు, ఆయన పబ్లిసిటీ కోసం ఫిర్యాదు చేశాడని, ఆయనకు హాని చేయాల్సిన అవసరం మాకు లేదని, సినిమాకు తాము అనుమతించకపోవడం వల్లే ఇలాంటి ఓవర్‌ యాక్టింగ్‌ నాటకాలు ఆడుతున్నాడు అంటూ

lakshmiparavathi