Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ మహేష్‌బాబుకు సూపర్ స్టార్ రజినీకాంత్ సాయం అవసరం వచ్చింది. తెలుగులో తెరకెక్కిన ‘స్పైడర్’ చిత్రాన్ని తమిళంలో భారీగా విడుదల చేసేందుకు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ సాయంను మహేష్‌బాబు పొందుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్‌బాబు, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘స్పైడర్’ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం మరియు హిందీలో కూడా విడుదల చేయాలని మురుగదాస్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. తన సొంత రాష్ట్రం అయిన తమిళనాడులో అత్యధిక థియేటర్లలో విడుదల చేసి, అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టాలని మురుగదాస్ ప్రయత్నాలు చేస్తున్నాడు.
తమిళంలో ‘స్పైడర్’కు భారీ క్రేజ్ రావాలి అంటే ఖచ్చితంగా రజినీకాంత్ వంటి స్టార్ల సాయం అవసరం. వారితో ప్రమోషన్ చేయించడం వల్ల సినిమా స్థాయి అమాంతం పెరిగి పోతుంది. అందుకే మురుగదాస్ మాట్లాడి రజినీకాంత్‌తో తమిళ స్పైడర్ ఆడియో విడుదల కార్యక్రమంకు వచ్చేందుకు ఒప్పించడం జరిగింది. మహేష్‌బాబుతో కూడా రజినీకాంత్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ కారణంగా కూడా రజినీ స్పైడర్ ప్రమోషన్స్‌కు సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. రజినీకాంత్ ప్రమోషన్స్‌తో పాటు మురుగదాస్ ఇమేజ్ కారణంగా తమిళంలో స్పైడర్ చిత్రం 40 కోట్లకు పైగా వసూళ్లు చేయడం ఖాయం అంటూ ట్రేడ్ పండితులు ఇప్పటి నుండే అంచనా వేస్తున్నారు. దసరా సందర్బంగా సినిమాను వచ్చేనెల 22న విడుదల చేయనున్న విషయం తెల్సిందే.
మరిన్ని వార్తలు: