తమిళ స్టార్ హీరో విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘కదరం కొండన్’ . జూలై 19న తెలుగు, తమిళ భాషలలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ జోరుగా ప్రమోషన్ చేస్తున్నారు. తాజాగా చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఇందులో కొన్ని స్టంట్స్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ చిత్రం విక్రమ్‌కి మంచి విజయాన్ని అందిస్తుందని అంటున్నారు. రాజేష్ ఎమ్ సెల్వ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్ పోలీస్ గా నటించాడు. అక్షరా హాసన్ ముఖ్య పాత్రలో నటించింది. ఈ చిత్రం తెలుగులో మిస్టర్ కెకె పేరుతో విడుదల కానుంది. మరోవైపు విక్రమ్ మలమాళం, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతున్న పౌరాణిక చిత్రం మహావీర్ కర్ణలో నటిస్తున్నారు. త్వరలో అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. మరోవైపు విక్రమ్ తనయుడు ధృవ్ అర్జున్ రెడ్డి రీమేక్( ఆదిత్య వర్మ) తో వెండితెరకి పరిచయమవుతున్న విషయం తెలిసిందే.