నటి మమతా మోహన్ దాస్ అంటే గుర్తుపట్టక పోవచ్చు ఎందుకంటే ఆమె సినిమాల్లో కనిపించి చాలా కాలమే అయ్యింది. అయితే ఆమె మళ్ళీ సినిమాల్లో ఎంటర్ అవ్వాలని చూస్తుందో ఏమో ? వార్తలలోకి నిలవడానికి ప్రయత్నం చేస్తోంది. టాలీవుడ్ లో ‘యమదొంగ’,’కింగ్’ వంటి చిత్రాల్లో నటించిన మమత కొంతకాలం పాటు క్యాన్సర్ కారణంగా ఇండస్ట్రీకు దూరమయ్యారు. ఆ తరువాత కోలుకోవడంతో తిరిగి మళ్లీ నటిగా తన కెరీర్ ను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఆమె తమిళ, మలయాళ చిత్రాలలో నటిస్తున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె కాస్టింగ్ కౌచ్ కు సంబంధించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అందంగా ఉన్న అమ్మాయిలపైనే అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయంటూ ఆమె కామెంట్స్ చేసింది.
”ఎక్కువగా అందంగా ఉన్న ఆడవాళ్లపైనే అఘాయిత్యాలు జరుగుతుంటాయి. అందంగా ఉన్న అమ్మాయి సమాజంలో బతకడం కష్టమని కానీ అందంగా ఉందని ఆడవారి జీవితాలు సంతోషంగానే ఉంటాయని మమత చెప్పుకొచ్చింది. అందంగా లేని వారు ప్రేమ, వృత్తి విషయాల్లో చక్కగా రాణిస్తున్నారని, అసలు ఓ మహిళ విషయంలో మగాడు తప్పు చేస్తున్నాడంటే ఆ విధంగా ఆ మహిళే అతడిని ప్రేరేపిస్తుందని నా అభిప్రాయమని చెప్పుకొచ్చింది. అలా అని అందరి జీవితాల్లో ఇలానే జరుగుతుందని చెప్పడం లేదు కానీ ఇప్పటికీ కొందరు మహిళలకు హద్దులు తెలియవని ఆడవాళ్లకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ చాలా ఎక్కువ. ప్రతిదానికి ఫీల్ అయిపోతుంటారని చెప్పుకొచ్చింది. అయితే మమత చేసిన వ్యాఖ్యల పట్ల కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఆడదానివి అయిన నువ్వు సాటి ఆడవాళ్లగురించి ఎలా మాట్లాడతావ్ అంటూ ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.