అయితే జిల్లాలోని బి.కొత్తకోట మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అత్యాచార యత్నం చేశారు ఇద్దరు దుర్మార్గులు. బాలిక బహిర్భూమికి వెళ్లడాన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన చల్లా వెంకటేష్, బత్తల చలపతి ఆమెను అడ్డుకున్నారు. ఒంటరి బాలికను బలవంతంగా లాక్కెళ్లి అత్యాచార యత్నం చేయసాగారు. కామంతో ఆమెపై పడి కోరికను తీర్చుకొనేందుకు గట్టిగా యత్నించారు. కాగా కామాంధుల దుర్మార్గపు చర్యను బాలిక తీవ్రంగా ప్రతిఘటిస్తూ పెద్దగా కేకలు పట్టింది. ఆ అరుపులు విని సమీప గ్రామస్థులు అక్కడికి చేరుకునేలోపు బాధితురాలిని అక్కడే వదిలేసి నిందితులు పరారై పోయారు. ఆ తర్వాత బాలికను సురక్షితంగా ఇంటికి చేర్చారు. నిందితులపై పాతనేరచరిత్ర ఉన్నట్లుగా తెలుస్తోంది. వెంటనే సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులపై అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.