Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ దొరికినప్పటి నుంచి ” ఉందిలే మంచి కాలం ముందుముందునా” అన్న పాట పాడుకుంటూ బీజేపీ తో ఎప్పుడు కలుస్తానా అని ఎదురు చూపులు చూస్తున్న జగన్ కి పెద్ద షాక్ తగిలింది. బీహార్ పరిణామాలు చూసి వైసీపీ అధినేత జగన్ బెంబేలు పడ్డాడు. నిన్న సాయంత్రం అనూహ్యంగా మారిన బీహార్ పరిణామాలు, సీఎం రాజీనామా ఎపిసోడ్ చూసి జగన్ పక్కనున్న పార్టీ ముఖ్యులు కొందరు ‘ చూసారా మోడీ తలుచుకుంటే అంతే. లాలూ,నితీష్ ఎవరైనా ఆయన చెప్పినట్టు వినాల్సిందే. ఇక చంద్రబాబుకి ముందుంది మొసళ్ల పండగ ‘ అని అన్నారట. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలకు బీజేపీకి మద్దతు ఇచ్చిన ఊపులో జగన్ కూడా హాయిగా నవ్వుకున్నాడట. ఆ కాసేపటికి నరేంద్ర మోడీ ట్వీట్ చూడటం తో జగన్ మొహం మాడిపోయిందట. ‘ అవినీతికి వ్యతిరేకంగా నిలబడ్డారు నితీష్… కంగ్రాట్స్ ‘ అని మోడీ ట్వీట్ చేయడం చూసి జగన్ కి భవిష్యత్ అర్ధం అయిపోయిందట.
ఒకవేళ ఇప్పుడు చంద్రబాబుని ఇబ్బంది పెట్టడానికి తనని బీజేపీ దగ్గరికి తీసుకున్నా ఎన్నికలు అయ్యాక అవినీతి సాకు చూపి మళ్లీ బాబుని సీఎం చేయదని గారంటీ ఏమైనా ఉందా ? అన్న ప్రశ్న జగన్ మదిలో తలెత్తిందట. దీంతో ఆయన కంగారు పడుతుంటే ఇంకో పార్టీ ముఖ్యుడు ఫోన్ చేసి జగన్ మనసులో డౌట్ ఎక్స్ ప్రెస్ చేసి జాగ్రత్తగా వుండాలని హెచ్చరించడంతో ఎలా రియాక్ట్ కావాలో అర్ధం గాక జగన్ సైలెంట్ గా ఉండిపోయాడట. ఏదేమైనా బీహార్ పరిణామం అసలే 2019 ఎన్నికల గురించి భయపడుతున్న జగన్ ని ఇంకాస్త అయోమయంలోకి నెట్టేసింది. కాదంటారా ?
మరిన్ని వార్తలు