Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ‘ఛలో’ మూవీకి మంచి ఓపెనింగ్స్ దక్కాయి. అదే రోజు విడులైన మాస్ మహారాజా రవితే ‘టచ్ చేసి చూడు’ చిత్రం పెద్దగా వసూళ్లను సాధించలేక పోయింది. మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ రావడంతో ‘ఛలో’ మూవీకి కలిసి వచ్చింది. ‘ఛలో’ మూవీకి ప్రేక్షకుల నుండి మరియు రివ్యూవర్స్ నుండి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. మొత్తంగా సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగిందని, యావరేజ్‌గా ఉందని టాక్‌ను సొంతం చేసుకుంది. ఇతర చిత్రాలు పోటీ లేకపోవడంతో పాటు, పోటీగా విడుదలైన చిత్రం ఫ్లాప్ అవ్వడంతో ‘ఛలో’ సినిమాకు కలిసి వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో భారీగా వసూళ్లు అయిన ‘ఛలో’ మూవీ మొదటి రోజు ఏకంగా 2.40 కోట్లు వసూళ్లు చేసిందని తెలుస్తోంది. ఒక చిన్న చిత్రం ఈరేంజ్‌లో వసూళ్లను సాధించడం గొప్ప విషయం. లాంగ్ రన్‌లో ఈ చిత్రం సునాయాసంగా 10 కోట్లను వసూళ్లు చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. నాగశౌర్య తల్లి ఉషా స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. నాగశౌర్య మార్కెట్‌ను పరిగణలోకి తీసుకోకుండా ఏకంగా పది కోట్లు పెట్టి ఈ చిత్రాన్ని తెరకెక్కించడంతో అంతా కూడా అవాక్కయ్యారు. అయితే సినిమా విడుదలై మంచి కలెక్షన్స్ వస్తున్న నేపథ్యంలో నష్టాలు లేకుండా నిర్మాత బయట పడటం ఖాయం అని విశ్లేషకులు అంటున్నారు. నాగశౌర్య కెరీర్‌లో ఇది అతి పెద్ద కమర్షియల్ సక్సెస్‌గా నిలుస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది.