Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘ఛలో’ చిత్రంతో యువ హీరో నాగశౌర్య భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. మొదటి సారి పెద్ద కమర్షియల్ సక్సెస్‌ను నాగశౌర్య దక్కించుకున్నాడు. ‘ఛలో’కు ముందు సాయి ప్లవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కణం’ అనే చిత్రంలో నాగశౌర్య నటించిన విషయం తెల్సిందే. విజయ్ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రంను ఇష్టపడి చేసిన నాగశౌర్య ఇప్పుడు ఆ సినిమాను చిన్న చూపు చూస్తున్నాడు. తెలుగు మరియు తమిళంలో ‘కణం’ను ఒకేసారి విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలకు నాగశౌర్య డుమ్మా కొట్టాడు.
గత కొన్ని నెలుగా విడుదల వాయిదా పడుతూ వస్తున్న ‘కణం’ చిత్రాన్ని ఈ వారంలో విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకోసం హైదరాబాద్‌లో చిత్రం ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ ప్రెస్మీట్లో దర్శకుడు విజయ్‌తో పాటు హీరోయిన్ సాయి పల్లవి ఇంకా పలువురు సినీ ప్రముఖులు హాజరు అయ్యారు. కాని నాగశౌర్య మాత్రం ఆ కార్యక్రమంలో కనిపించలేదు. చిత్ర నిర్మాత రిక్వెస్ట్ చేసినా కూడా ప్రస్తుతం తాను బిజీగా ఉన్నాను అని, ముందుగా చెప్పి ఉంటే ప్లాన్ చేసుకునేవాడిని అంటూ కార్యక్రమంకు డుమ్మా కొట్టాడట. దర్శకుడు విజయ్ కూడా నాగశౌర్యకు ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. మొత్తానికి ‘కణం’ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు కాకుండా నాగశౌర్య దూరంగా ఉంటున్న నేపథ్యంలో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ‘కణం’ వంటి విభిన్న చిత్రంలో నాగశౌర్య నటించి, ఇప్పుడు ఆ చిత్రాన్ని విష్మరించడం మంచి పద్దతి కాదు అంటూ సినీ వర్గాల వారు కూడా హితవు పలుకుతున్నారు. సినిమా షూటింగ్ సమయంలో సాయి పల్లవితో నాగశౌర్యకు విభేదాలు ఏర్పడ్డాయి, ఆ కారణంగానే ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాడు అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.