టాలీవుడ్ ప్రేక్షకులకు మల్టీస్టారర్ చిత్రాలంటే భారీ మోజు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో మలితరం భారీ మల్టీస్టారర్ చిత్రాలకు శ్రీకారం చుట్టారు. ఆ చిత్రం సాదా సీదాగా ఉన్నా కూడా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించడం వల్ల మంచి వసూళ్లు నమోదు అయ్యాయి. సీతమ్మ చిత్రం తర్వాత వరుసగా మల్టీస్టారర్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాయి. తాజాగా నాగార్జున మరియు నానిలు కలిసి నటించిన ‘దేవదాస్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను తాజాగా విడుదల చేయడం జరిగింది. అంచనాలను మించి ఈ ఫస్ట్‌లుక్ ఉండటంతో సినిమా ఖచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను దక్కించుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
డాన్‌గా నటిస్తున్న నాగార్జున, డాక్టర్‌గా నటిస్తున్న నానిలు ఇద్దరు కూడా బాగా తాగి సోయి లేకుండా పడుకుని ఉన్న ఫొటోను ఫస్ట్‌లుక్ అంటూ విడుదల చేశారు. పడుకున్న వారి పొజీషన్ మరియు వారిద్దరి గెటప్స్ సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకు వెళ్తున్నాయి. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ మరో వారం పది రోజుల్లో పూర్తి కానున్నట్లుగా తెలుస్తోంది. భారీ ఎత్తున ఈ చిత్రంను ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ నిర్మిస్తున్న విషయం తెల్సిందే. సెప్టెంబర్ చివరి వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు అశ్వినీదత్ ఏర్పాట్లు చేస్తున్నాడు. శ్రీరామ్ ఆధిత్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై నాగార్జున మరియు నానిలు ఇద్దరు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాగార్జున వరుసగా మల్టీస్టారర్ చిత్రాలు చేస్తూ బిజీ అవుతున్నాడు. అయితే నాని మాత్రం ఈ చిత్రంలో నటించడం కాస్త ఆసక్తికరంగా మారింది. ఫస్ట్‌లుక్‌తో అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుందో చూడాలి.