Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అక్కినేని హీరో అఖిల్ రెండవ సినిమా కోసం ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి సినిమా ఫ్లాప్ అయిన నేపథ్యంలో అఖిల్ రెండవ సినిమాతో అయినా స్టార్ హీరో ఇమేజ్ను దక్కించుకుంటాడా అనే చర్చ సినీ వర్గాల్లో జరుగుతుంది. చాలా చర్చలు జరిపి, కథలు విన్న తర్వాత దర్శకుడు విక్రమ్ కె కుమార్‌తో అఖిల్ సినిమా ఖరారు అయ్యింది. మొదట ఒక కథతో అనుకుని, కొంత చిత్రీకరణ జరిపి, ఆ కథ వద్దనుకుని మరో కథతో సినిమాను చేయడం జరుగుతుంది. ఒక క్యూట్ లవ్ స్టోరీతో అఖిల్ రెండవ సినిమా రాబోతుంది. ఇప్పటికే సినిమాకు ‘హాలో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మొదట ఇంత సింపుల్ టైటిల్ ఏంటి అంటూ కాస్త ఫ్యాన్స్ నిరుత్సాహం చెందారు. మెల్ల మెల్లగా హాలో కి ఫ్యాన్స్ అలవాటు పడిపోయారు.
తాజాగా నాగార్జున తన పుట్టిన రోజు సందర్బంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా అఖిల్ రెండవ సినిమా ‘హాలో’ గురించి కూడా మాట్లాడాడు. సినిమాకు ఒక మంచి క్యాచీ టైటిల్‌ను పెట్టాలని ఎంతో ఆలోచించాం. చివరకు హలో అనే పదాన్ని పెట్టాలని భావించాం. సినిమాలో హీరోయిన్‌తో హలో చెప్పించుకునేందుకు హీరో తెగ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆమె ఎంతకు హలో చెప్పదు. చివరకు ప్రేమలో పడ్డ తర్వాత హలో చెబుతుంది. అందుకే ఈ సినిమాకు హలో అనే టైటిల్‌ను పెట్టినట్లుగా నాగార్జున చెప్పుకొచ్చాడు. మొదట ఫ్యాన్స్ చేసిన కామెంట్స్‌కు తాము తప్పు నిర్ణయం తీసుకున్నామా అనుకున్నాం. కాని మెల్ల మెల్లగా టైటిల్‌ను వారు ఓన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు హ్యాపీ అన్నాడు. హీరోయిన్ కారణంగా సినిమా ఆలస్యం అయ్యిందని, అయినా కూడా సినిమా బాగా వస్తుందని చెప్పుకొచ్చాడు. త్వరలోనే విడుదల తేదీపై క్లారిటీ ఇస్తామని కూడా నాగ్ పేర్కొన్నాడు.
మరిన్ని వార్తలు: