ప్రస్తుతం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ లలో నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా చేస్తున్న తన కెరీర్ 109 వ మూవీ కూడా ఒకటి. మరి బాలయ్య అభిమానులు బాలయ్య మూవీ తో పాటుగా తన వారసుడు నందమూరి మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ కోసం కూడా ఎన్నో ఏళ్ల తరబడి అయితే వారు ఎదురు చూస్తుండగా మోక్షజ్ఞ కూడా తన మొదటి మూవీ కోసం సూపర్ లుక్ ను అయితే ప్రిపేర్ చేసున్నాడు.

అయితే లేటెస్ట్ గా తన నుంచి ఒక లుక్ మాత్రం ఫ్యాన్స్ లో మంచి వైరల్ గా మారింది. మరి ఇందులో మాత్రం మోక్షజ్ఞ అదరగొట్టేసాడు అని చెప్పాలి. ట్రిమ్ అండ్ స్లిమ్ లుక్ లో మూవీ ఎంట్రీకి రెడీగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు. దీనితో మాత్రం ఈ నయా లుక్ చూసి బాలయ్య ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. మరి వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ అవైటెడ్ ఎంట్రీ బాలయ్య ఎప్పుడు ఫిక్స్ చేసారో చూడాలి మరి.
Mokshu getting ready
Ah cut out and look
#NBK109 #NandamuriBalakrishna pic.twitter.com/C5OhA5dWgF
— NBK Cult
(@iam_NBKCult) February 22, 2024