Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సంక్రాంతి బరిలో దిగుతానన్న రవితేజ కొన్ని కారణాల వల్ల తన పుట్టిన రోజు సందర్బంగా రిపబ్లిక్ డేను పురష్కరించుకుని జనవరి 25 లేదా 26న తన ‘టచ్ చేసి చూడు’ చిత్రాన్ని విడుదల చేస్తాను అంటూ ప్రకటించాడు. అయితే రిపబ్లిక్ డేకు కూడా సినిమాను విడుదల చేయడంలో విఫలం అయ్యారు. కారణం ఏదో కాని రిపబ్లిక్ డే సందర్బంగా విడుదల చేయని ‘టచ్ చేసి చూడు’ చిత్రాన్ని ఫిబ్రవరి 2న విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 2న ఇప్పటికే నాని నిర్మాణంలో తెరకెక్కిన ‘అ!’ మరియు నాగశౌర్య హీరోగా నటించిన ‘ఛలో’ చిత్రాలు విడుదలకు సిద్దం అయ్యాయి. ఆ రెండు చిత్రాలే విడుదల కాబోతున్న నేపథ్యంలో నాని ‘అ!’ చిత్రానికి మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని అంతా భావించారు. అయితే రవితేజ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో నాని తలపట్టుకున్నట్లుగా తెలుస్తోంది.
రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత రవితేజ ఒకేసారి రెండు చిత్రాలకు కమిట్ అయ్యాడు. అందులో మొదటిది ‘రాజా ది గ్రేట్’. ఆ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇక విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రూపొందిన ‘టచ్ చేసి చూడు’ చిత్రం కూడా రవితేజలోని మాస్ పవర్‌ను చూపిస్తుందనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు. రవితేజ గతంలో పలు చిత్రాల్లో పోలీస్‌గా కనిపించాడు. ఎక్కువ శాతం రవితేజ పోలీస్‌గా సక్సెస్‌లను దక్కించుకున్నాడు. తాజాగా ఈ చిత్రంలో కూడా రవితేజ పోలీస్‌గా కనిపిస్తున్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తీసిపోకుండా దర్శకుడు విక్రమ్ సిరీ సినిమాను తెరకెక్కించాడు అనే విషయం టీజర్ చూస్తుంటే అర్థం అవుతుంది. సినిమా ట్రైలర్‌ను ఈనెల 27న ప్రీ రిలీజ్ వేడుక జరిపి విడుదల చేయబోతున్నారు. ‘టచ్ చేసి చూడు’ విడుదల కానున్న నేపథ్యంలో ఛలో మరియు నాని నిర్మించిన ‘అ!’ చిత్రాల కలెక్షన్స్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. దాంతో ఆ రెండు చిన్న చిత్రాల నిర్మాతలు ఇప్పుడేం చేయాలో పాలుపోక తలపట్టుకున్నారు.