Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
యువ హీరో నాని వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్లను అందుకుంటూ దూసుకు పోతున్నాడు. తాజాగా ‘నిన్నుకోరి’ చిత్రంతో సక్సెస్ను సాధించిన నాని ప్రస్తుతం ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ మరియు ‘కృష్ణార్జున యుద్దం’ చిత్రాల్లో నటిస్తున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ఇక ‘కృష్ణార్జునయుద్దం’ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం చిత్రీకరణ తాజా షెడ్యూల్ ప్రారంభం అయ్యింది.
ఈ షెడ్యూల్లో నానితో పాటు ‘ప్రేమమ్’, ‘శతమానంభవతి’ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పాల్గొంటుంది. వరుసగా ఆఫర్లు వస్తున్నప్పటికి అన్నింటికి ఓకే చెప్పకుండా ఈ సినిమాకు మాత్రమే అనుపమ ఓకే చెప్పింది. తెలుగులో అనుపమకు మంచి క్రేజ్ ఉంది. అది నాని సినిమాకు ఉపయోగపడటం ఖాయం అని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే సంవత్సరం వేసవిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విభిన్న కథాంశంతో దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. వరుస విజయాలతో దూసుకు పోతున్న నానికి ఈ సినిమా మరో విజయాన్ని సాధించి పెట్టడం ఖాయం అని, సహజ నటుడిగా పేరున్న నాని ఈ సినిమాలో మంచి పాత్రను పోషిస్తున్నాడు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.