Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నాచురల్ స్టార్ నాని ఇంకో కొత్త. సినిమా ఒప్పుకున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా కథ నచ్చితే ఓకే అనుకుంటూ వెళ్లే నాని ఇప్పుడు కూడా అదే ఒరవడి లో కొత్త సినిమా ని ఓకే చేసాడు. మైత్రి మూవీస్ పతాకం మీద ఓ సినిమా చేస్తానని నాని కమిట్ అయ్యాడు. అయితే ఎవరి దర్శకత్వంలో సినిమా చేయాలన్నదానిపై ఇప్పటిదాకా తర్జనభర్జనపడిన నాని తాజాగా తిరుమల కిషోర్ చెప్పిన కధకు ఓకే చెప్పాడు. ఈ కాంబినేషన్ లో సినిమా సెట్ అయినట్టే. అయితే శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగ్ తో చేయబోయే మల్టి స్టారర్ సినిమా తర్వాత ఈ సినిమా మొదలు అవుతుంది.
నేను శైలజ హిట్ తో ఇండస్ట్రీ ని తన వైపు తిరిగి చూసేలా చేసిన తిరుమల కిషోర్ మీద చాలా మంది పెద్ద హీరోల కన్ను పడింది. విక్టరీ వెంకటేష్ సహా కొందరు హీరోలతో కిషోర్ సినిమా ఉంటుందని ప్రచారం కూడా జరిగింది. ఈ ఊహాగానాలకు భిన్నంగా మళ్లీ రామ్ హీరోగా చేసిన వున్నది ఒకటే జిందగీ ప్లాప్ కాగానే కిషోర్ కెరీర్ స్లంప్ లో పడింది. కానీ ఇప్పుడు కిషోర్ కధకు మంచి ఫామ్ లో వున్న నాని ఓకే చెప్పడంతో ఆయనకి సూపర్ ఛాన్స్ దొరికినట్టే. ఈ అవకాశాన్ని ఉపయగించుకుని కిషోర్ ఈసారి భారీ హిట్ ఇవ్వాలని కోరుకుందాం.