శ్రీరెడ్డి వ్యాఖ్యలపై నాని భార్య స్పందన

Nani Wife Anjana Yelavarthy Respond On Sri Reddy Comments

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

నానిపై శ్రీరెడ్డి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తుంది. గత కొన్ని రోజులుగా నానిని మంచోడు కాదంటూ చెబుతూ వస్తున్న శ్రీరెడ్డి ఈమద్య మరీ రెచ్చి పోయి అసభ్య పదజాలంతో వ్యాఖ్యు చేస్తూ ఉంది. నాని హోస్ట్‌గా ప్రసారం అవుతున్న బిగ్‌బాస్‌ సీజన్‌ 2లో శ్రీరెడ్డికి మొదట ఛాన్స్‌ వచ్చింది. అయితే నానికి శ్రీరెడ్డికి మద్య జరుగుతున్న వివాదంతో ఆమెను తప్పించారు. దాంతో శ్రీరెడ్డి తనను నాని వల్లే తప్పించారు అని, నాని తనను తొగించాలని డిమాండ్‌ చేశాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది. నానిపై మరింత కక్ష పెంచుకున్న శ్రీరెడ్డి తనతో నాని సెక్స్‌ చేశాడు అంటూ ఏ ఆడది చేయని సంచలన కామెంట్స్‌ చేసింది. దాంతో సినీ ఇండస్ట్రీతో పాటు అంతా కూడా అవాక్కవుతున్నారు. ట్విట్టర్‌లో శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారంను రేపుతున్న సమయంలో నాని కుటుంబంలో పరిస్థితి ఎలా ఉందా అని కొందరు ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే నాని కుటుంబం మొత్తం ఆయన వెంట నిలిచినట్లుగా తెలుస్తోంది.

తాజాగా నాని భార్య అంజన మాట్లాడుతూ తన భర్త గురించి తనకు పూర్తిగా తెలుసు అని, ఎవరో పబ్లిసిటీ కోసం చేస్తున్న విమర్శలను తాను పట్టించుకోను అని, నాని గురించి తెలిసిన వారు ఎవరు కూడా ఆమె వ్యాఖ్యలను పట్టించుకోరు అంటూ చెప్పుకొచ్చింది. కొందరి పరువు తీయాలనే ఉద్దేశ్యంతో శ్రీరెడ్డి తనను తాను దిగజార్చుకుంటుంది అంటూ ఇండైరెక్ట్‌గా వ్యాఖ్యలు చేసింది. నాని గురించి అంజనా సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌తో శ్రీరెడ్డిపై విమర్శలు పెరుగుతున్నాయి. మరో వైపు శ్రీరెడ్డి కూడా అంతే స్థాయిలో విమర్శలు చేసేందుకు సిద్దం అవుతుంది. శ్రీరెడ్డితో ప్రముఖులు ఎంతగా ప్రయత్నించినా కూడా ఆమె మాత్రం వెనక్కు తగ్గకుండా విమర్శల మీద విమర్శలు చేస్తూనే ఉంది. శ్రీరెడ్డి విమర్శలు మరెంత దూరం తీసుకు వెళ్తాయో అంటూ సినీ పండితులు మరియు మీడియా వర్గాల వారు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.