Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అమరావతి కేంద్రంగా సాగుతున్న ఏపీ సచివాలయంలో అంతర్గత రాజకీయాలు స్టేట్ పాలిటిక్స్ కి ఏ మాత్రం తగ్గడం లేదట. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే అధికార పక్షంతో పాటు విపక్షం కూడా తన హవా కొనసాగిస్తూ ఉండటమే. పైకి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సచివాలయ ఉద్యోగులు చంద్రబాబు, జగన్ గ్రూపులుగా విడిపోయారు. ఇదేమీ కొత్త విషయం కాదు. ఎప్పుడూ జరిగేదే. ఈసారి కొత్త విషయం ఏమిటంటే సచివాలయంలో జగన్ ని అభిమానించే వాళ్ళు ఇప్పటికీ టీడీపీ సానుభూతిపరుల కన్నా కీలక పదవుల్లో కొనసాగడం.
రాష్ట్ర రాజకీయాల ప్రభావమే సచివాలయం మీద కూడా పడింది. జగన్ సానుభూతిపరులైన ఉద్యోగులు కొందరు వ్యూహాత్మకంగా ఆపరేషన్ ఆకర్ష్ కి లోనై టీడీపీ లో చేరిన ఎమ్మెల్యేల అండతో పట్టు బిగిస్తున్నారు. వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు చేస్తున్న సిఫార్సులతో జగన్ అభిమానులు అనుకునేవాళ్ళకి కూడా మంచి పొజిషన్స్ లో ఉంటున్నారట . కింది స్థాయి ఉద్యోగుల విషయంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందట .సీఎం పేషీ, జీఏడీ కూడా ఇదే పరిస్థితిలో వున్నాయట. అందుకే సీఎం ఎంతో రహస్యం అనుకున్న విషయాలు కూడా చక్కా బయటికి చేరిపోతున్నాయట.
అక్కడక్కడా పై స్థాయిలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది అని సమాచారం. జగన్ ని అభిమానించి చంద్రబాబు అంటే కోపం ప్రదర్శించే వాడిగా సచివాలయం అంతా తెలిసిన ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి విషయం ఇందుకు ఓ ఉదాహరణగా కొందరు చెప్పుకుంటున్నారు. ఈయనకి తన శాఖలో కీలక బాధ్యతలు అప్పగిస్తూ మంత్రి లోకేష్ తీసుకున్న నిర్ణయం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. జవహర్ రెడ్డి వ్యవహారశైలి తెలిసిన సాటి ఐఏఎస్ అధికారులు ఇప్పుడు లోకేష్ నిర్ణయం గురించి గుసగుసలాడుకుంటున్నారట. ఇది ఈర్ష్య తో సాగుతున్న ప్రచారం అయితే పర్లేదు కానీ నిజంగానే సచివాలయంలోను జగన్ అభిమాన గణం హవా సాగుతోంది అంటే మాత్రం లోకేష్ ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి. ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం ప్రదర్శిస్తే నష్టం జరిగాక ఏమి అనుకున్నా ప్రయోజనం ఉండదు.
మరిన్ని వార్తలు: