Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నల్లధనంపై యుద్ధం చేస్తున్న మోడీ.. నోట్లరద్దుతో ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించారు. నోట్ల రద్దు కారణంగా వచ్చిన లాభనష్టాల్ని పక్కనపెడితే.. అసలు అంత సాహసోపతేమైన నిర్ణయం తీసుకోవాలంటే చాలా తెగువ కావాలని స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్రశంసించారు. ఇక తర్వాత జీఎస్టీ గురించి చెప్పేదేముంది. జీఎస్టీ అమలు విప్లవాత్మక సంస్కరణ అని ప్రపంచ బ్యాంకు కూడా కొనియాడింది.
కానీ మోడీ అంతటితో సంతృప్తి చెందడం లేదు. వచ్చే ఎన్నికల ముందు ప్రజాపయోగ చర్యలు తీసుకోవాలని భావిస్తున్న గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల లిస్టు తీసి చూశారట. చూస్తే.. టోల్ గేట్ల ఎత్తివేత అనే అంశం ఆయన్ను బాగా ఆకర్షించింది. జీఎస్టీతో చెక్ పోస్టులు పోయాయని, ఇప్పుడు టోల్ గేట్లు కూడా పోతే జనమంతా బీజేపీకే ఓట్లేస్తారని మోడీ అనుకుంటున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 434 టోల్ ప్లాజాలున్నాయి. టోల్ గేట్ల నిర్వాహకులు ఇష్టం వచ్చినట్లుగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఓ సారి టోల్ ఫీజు కడితే.. అది ఓసారి వెళ్లడానికే పనికొస్తుంది. మళ్లీ వెనక్కి వచ్చేటప్పుడు ఇంకోసారి డబ్బులు సమర్పించుకోవాల్సిందే. చాలా మంది జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు. అందుకే వీరి అవస్థలు తప్పించి ఓట్లు కొల్లగొట్టాలని మోడీ ప్లాన్ చేస్తున్నారు.
మరిన్ని వార్తలు: