సూపర్ స్టార్ మహేష్‌బాబు 25వ చిత్రం ‘మహర్షి’పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు ఈ చిత్రం విడుదల అవుతుందా అంటూ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే వేసవిలో విడుదల కాబోతున్న ఈ చిత్రంకు సంబంధించిన చివరి దశ చిత్రీకరణ హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరుగుతోంది. రికార్డు స్థాయిలో ఇప్పటికే ఈ చిత్రం బిజినెస్ జరుగుతున్నట్లుగా సమాచారం అందుతుంది. దాదాపు 150 కోట్లకు పైగా ఈ చిత్రాన్ని నిర్మాతలు అమ్మేందుకు పక్కా ప్రణాళికను సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధింన సీన్స్ చిత్రీకరణలో మహేష్ బాబు రైతు పోరాట నాయకుడిగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.
విదేశాల్లో పెద్ద బిజినెస్‌మన్ అయిన మహేష్ బాబు తన మిత్రుడు అల్లరి నరేష్ కోసం ఒక పల్లెటూరుకు వస్తాడట. ఆ పల్లెటూరులో రైతులు వ్యవసాయం చేసి అప్పులపాలై అమటిస్తూ ఉంటారు. దాంతో వారి పక్షాణ నిల్చుని వారికి వ్యవసాయంలో కొత్త మెలుకువలు చెప్పడంతో పాటు, రైతుల పక్షంలో నిల్చుని వారి సమస్యలపై ప్రభుత్వంతో పోరాడుతాడట. అందుకే మహర్షి చిత్రంలో మహేష్‌బాబు రైతు నాయకుడిగా కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. అల్లరి నరేష్ ఒక కీలక పాత్రలో ఈ చిత్రంలో నటిస్తున్న కారణంగా అందరి దృష్టి అతడిపాత్రపై ఉంది. ఇప్పటి వరకు కమెడియన్‌గా మాత్రమే నటించిన ఆయన సీరియస్ పాత్రలో కనిపించబోతున్నాడు.