Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డ్రగ్స్ రాకెట్లో పట్టుబడ్డ కెల్విన్ మరియు గ్యాంగ్ వారిని విచారించిన తర్వాత టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రెటీల వివరాలు వారి వద్ద లభించాయి. అందులో కొందరు డ్రగ్స్ తీసుకున్నట్లుగా వారి విచారణలో వెళ్లడైంది. ఇక కొందరు డ్రగ్స్‌ను సరఫరా చేసేవారు అని కూడా సిట్ అధికారులు గుర్తించారు. తాజాగా వారికి నోటీసులు జారీ చేయడం, వారిలో ఒక్కొక్కరిని విచారించడం జరుగుతుంది. నేడు నవదీప్ వంతు వచ్చింది. నవదీప్ విచారణకు వెళ్లే ముందు మీడియాతో ఏమైనా మాట్లాడుతాడేమో అని అంతా కూడా ఆయన ఇంటి ముందు ఉదయం 9 గంటల నుండి ఎదురు చూస్తూ ఉండి పోయారు. 10 దాటింది, 10.30 అయినా కూడా నవదీప్ ఇంట్లోంచి బయటకు రాలేదు. ఈలోపు ఆబ్కారీ బిల్డింగ్ వద్ద నవదీప్ ప్రత్యక్షం అయ్యాడు.
నవదీప్ మీడియాను ఎదుర్కోలేక నిన్న రాత్రే పార్క్ హయత్ హోటల్‌కు వెళ్లాడని, అక్కడ రాత్రి అంతా బస చేసి, ఉదయం సిట్ విచారణకు వెళ్లాడు అని తెలుస్తోంది. మీడియాకు ముఖం చూపించలేకే నవదీప్ ఇలా చేశాడని కొందరు అంటున్నారు. అయితే పార్క్ హయత్ హోటల్లో పార్టీ ఉండటం వల్ల రాత్రి అక్కడకు వెళ్లి, అక్కడే పడుకున్నాడు అని కొందరు అంటున్నారు. మొత్తానికి నేడు విచారణకు నవదీప్ దొంగల పారిపోయి హాజరు అయ్యాడు అనే అపవాదు మూట కట్టుకున్నాడు. సిట్ అధికారుల విచారణ పూర్తి అయిన తర్వాత ఐనా మీడియాతో మాట్లాడతాడేమో చూడాలి.
మరిన్ని వార్తలు: