Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భావన కిడ్నాప్ కేసులో మలయాళ హీరో దిలీప్ అరెస్టయ్యాడు. అతడు తన బెయిల్ కోసం పెట్టుకున్న అర్జీని కూడా కోర్టు తోసిపుచ్చింది. పైగా పోలీస్ కస్టడీకి ఇచ్చింది. దీంతో పోలీసులకు నిజాలు రాబట్టేందుకు మరింత టైమ్ దొరికినట్లైంది. విచారణలో పోలీసులకు కొత్త నిజాలు తెలుస్తున్నాయి. కీలక సాక్షిగా భావిస్తున్న దిలీప్ మేనేజర్ అండర్ గ్రౌండ్ కు వెళ్లడంతో కొత్త అనుమానాలు వస్తున్నాయి.
దిలీప్ కథంతా మేనేజర్ ద్వారానే నడిపాడని, తాను కేవలం సూత్రధారిగానే ఉన్నాడని ఖాకీలకు తెలిసిపోయింది. దీంతో ఆ దిశగా దిలీప్ ను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. అవసరమైతే థర్డ్ డిగ్రీ ప్రయోగానికి కూడా కోర్టు అనుమతి అడిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పరువు పోయిందని భావిస్తున్న మలయాళ చిత్ర పరిశ్రమ.. ఇక దిలీప్ కు దూరంగా ఉంటోంది.
కిడ్నాప్ కు ముందు రోజు దిలీప్ ఎవరెవరికి ఫోన్లు చేశాడు, పల్సర్ సునీల్ తో ఎలా పరిచయం వంటి విషయాలన్నీ పోలీసులు దిలీప్ నుంచి రాబట్టాల్సి ఉంది. కస్టడీ ముగిస్తే.. మళ్లీ పొడిగించమని అడిగే అవకాశం ఉంది. మొత్తం మీద భావన కిడ్నాప్ కేసులో పీకల్లోతున ఇరుక్కున్న బీజేపీ నేత ఇప్పుడు ఆ కేసులో అందర్నీ ఇరికించేలా ఉన్నారని.. సన్నిహితులు భయపడుతున్నారు.
మరిన్ని వార్తలు: