రాజమౌళి దర్శకత్వంలో చరణ్ ఎన్టీఆర్ లు హీరోలుగా ఆర్ ఆర్ ఆర్ అనే మల్టీ స్టారర్ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆ మద్య కోకాపేటలో కొంత మేరకు షూటింగ్ జరుపుకుంది. ఈ మద్యలో ఆర్ ఆర్ ఆర్ కు కాస్త బ్రేక్ ఇచ్చాడు రాజమౌళి. దీంతో చరణ్ వినయ విధేయ రామ లాస్ట్ సాంగ్ షూటింగ్ పనులతోనూ, ఆడియో వేడుక పనులతో చాలా బిజీగా ఉన్నాడు. ఇక రాజమౌళి కూడా తన కొడుకు కార్తికేయ పెళ్లి పనులతో చాలా బిజీగా ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ చిత్రంపై ఆ మద్య చాలా వార్తలు వచ్చాయి ఈ చిత్రం ఇండియా కు స్వాతంత్రం రాకముందు జరిగే కథని చరణ్ పోలీస్ ని ఎన్టీఆర్ దొంగని రకరకాలుగా వార్తలో నిలిచింది కానీ ఇంతవరకు పక్క అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. తాజాగా ఈ చిత్రం 1930నుండి 2020వరకు ఉంటుంది అంట. అంటే రెండు జన్మలు ఉంటాయి. ఈ కాన్సెప్ట్ తో బాలీవుడ్ లో కరణ్-ఆర్జున్ అనే సినిమా వచ్చింది షారుఖ్-సల్మాన్ హీరోస్ ఓ జన్మలో విలన్ చేతిలో చనిపోయి, మరో జన్మలో వేరు వేరు తల్లుల్ల కడుపులో పుడుతారు. ఆ గతం గుర్తుకు వచ్చి ఆ విలన్ ను చంపివేస్తారు. తెలుగులో చరణ్ మగధీర చిత్రం వచ్చింది. ఈ రెండు చిత్రాలు దాదాపుగా ఒకే కాన్సెప్ట్ తో ఉంటాయి కానీ సినిమాను తియ్యడంలో ఎవరుకు వారు డిఫరెంట్ గా తీసి మంచి విజయాని అందుకున్నారు. ఇప్పుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ లో చరణ్ తారక్ లు స్నేహితులుగా కనిపిస్తారంట. ఈ రెండు జన్మల పాయింట్ నిజమో కాదో తెలియదు కానీ ఫైనల్ గా రాజమౌళి మాత్రం ఏ మంత్రం వేసి మెప్పిస్తాడో చూడాలి మరి.