Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఈమద్య కాలంలో టాలీవుడ్ సినిమాలకు రెండవ అతి పెద్ద మార్కెట్‌గా ఓవర్సీస్ నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కొన్ని సినిమాలు నైజాంలో కంటే ఎక్కువగా అమెరికాలోనే వసూళ్లు చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. అంతటి వసూళ్లను రాబడుతున్న ఓవర్సీస్పైనే యువ హీరోలు స్టార్ హీరోలు ఫోకస్ పెడుతున్నారు. తాజాగా విడుదలైన ‘రంగస్థలం’ చిత్రం కేవలం మొదటి రోజే రెండు మిలియన్ డాలర్లను వసూళ్లు చేసింది. లాంగ్ రన్లో కనీసం అయిదు కోట్ల మిలియన్ డాలర్లను చిత్రం వసూళ్లు చేస్తుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. అందుకే నితిన్ కూడా ఓవర్సీస్ ప్రేక్షకులను టార్గెట్ చేయబోతున్నాడు.
నితిన్ హీరోగా మేఘ ఆకాష్ హీరోయిన్గా తెరకెక్కిన ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఈనెల 5న విడుదల కాబోతున్న ఈ చిత్రంను పవన్ నిర్మించిన కారణంగా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే సహకారం కూడా ఉండటంతో ఓవర్సీస్లో ఈ చిత్రంపై భారీ ఆసక్తి ఉంది. అందుకే కనీసం నాలుగు మిలియన్ డాలర్ల వసూళ్లు టార్గెట్‌గా చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అమెరికాలో అత్యధిక స్క్రీన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ చేస్తున్నారు. ఒక వైపు రంగస్థలం ఉన్నా కూడా ఈ చిత్రంపై నమ్మకంతో భారీ స్క్రీన్స్‌ను తీసుకుంటున్నారు. మరి నితిన్‌ను ఓవర్సీస్ ప్రేక్షకులు ఆధరిస్తారా అనేది చూడాలి.