విజయ్ దేవరకొండకు ఎక్కడో సుడి ఉన్నట్లుంది. ఈయన చేసిన పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలు భారీ వసూళ్లను సాధించాయి. తాజాగా ‘గీత గోవిందం’ చిత్రం కూడా విజయ్ దేవరకొండ కెరీర్‌లో నిలిచిపోయేలా విజయాన్ని దక్కించుకుంది. వారం క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన గీత గోవిందం చిత్రంకు తాజాగా విడుదలైన నాలుగు చిత్రాల్లో ఏదో ఒకటి పోటీగా నిలిచే అవకాశం ఉందని అంతా భావించారు. కాని ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. దాంతో గీత గోవిందం చిత్రం మరో వారం పాటు జోరును కొనసాగించడం ఖాయంగా కనిపిస్తుంది. గీత గోవిందం చిత్రం ఈ వీకెండ్‌లో కూడా దుమ్ము రేపడం ఖాయం అని, త్వరలోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను ఈ చిత్రం చేరుతుందని సినీవర్గాల వారు అంటున్నారు.
నిన్న విడుదలైన చిత్రాల్లో ‘ఆటగాళ్లు’, ‘నీవెవరో’ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆయా చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంతో చెప్పారు. కాని తీరా సినిమా విడుదలైన తర్వాత చూస్తే ఈ రెండు చిత్రాలతో పాటు, మరో రెండు చిత్రాలు కూడా ప్రేక్షకులను అలరించలేక పోయాయి. ఏమాత్రం ఆ నాలుగు సినిమాలు మెప్పించలేక పోవడంతో ప్రేక్షకులకు సినిమాకు వెళ్లాలి అంటే గీత గోవిందం తప్ప మరో ఆప్షన్ లేదు. వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు ‘నర్తనశాల’ మరియు ‘పేపర్‌బాయ్’ చిత్రాు విడుదల అయ్యే అవకాశం ఉంది. ఆ చిత్రాలు వచ్చే వరకు గీత గోవిందంకు ఎలాంటి ఢోకా లేదు అంటూ ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మొత్తానికి గీత గోవిందం చిత్రంకు లక్ కలిసి వచ్చి వరుసగా సెలవలు రావడంతో పాటు, పోటీ లేకపోవడం వల్ల భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి.