త్రివిక్రమ్‌ బిగ్‌ టార్గెట్‌.. ఎన్టీఆర్‌ హ్యాపీ

NTR Happy To Say Trivikram Big Target For His Next Movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ‘జైలవకుశ’ చిత్రం తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకుని చేయబోతున్న సినిమాకు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించబోతున్న విషయం తెల్సిందే. పవన్‌ 25వ చిత్రం అజ్ఞాతవాసి తీసి అట్టర్‌ ఫ్లాప్‌ను చవిచూసిన త్రివిక్రమ్‌ తదుపరి సినిమాతో పెద్ద టార్గెట్‌ను పెట్టుకున్నాడు. అజ్ఞాతవాసితో కెరీర్‌లో పెద్ద ఫ్లాప్‌ను చవిచూసిన దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తర్వాత చిత్రంతో బిగ్గెస్ట్‌ హిట్‌ను అందుకోవాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడు. అజ్ఞాతవాసి చిత్రం వల్ల నిర్మాత రాధాకృష్ణ భారీగా నష్టపోకపోయినా కూడా లాభాలు మాత్రం పెద్దగా వచ్చింది లేదు. అందుకే ఎన్టీఆర్‌ సినిమాతో రాధాకృష్ణకు 50 కోట్ల ప్రాఫిట్‌ను తెచ్చి పెట్టాలనే నిర్ణయానికి త్రివిక్రమ్‌ వచ్చినట్లుగా తెలుస్తోంది.

ఎన్టీఆర్‌తో చేయబోతున్న సినిమా కోసం త్రివిక్రమ్‌ 50 కోట్ల లోపు బడ్జెట్‌ను కేటాయించడం జరిగింది. అన్ని రైట్స్‌తో కలిపి ఈ చిత్రానికి 50 కోట్లు వచ్చేలా మార్కెటింగ్‌ చేయడంతో పాటు, భారీ కలెక్షన్స్‌ వచ్చేలా సినిమాను తెరకెక్కించాలని త్రివిక్రమ్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. భారీ అంచనాల నడుమ తెరకెక్కబోతున్న ఈ చిత్రంకు భారీ బిజినెస్‌ అవ్వడం ఖాయం. అయితే సినిమా సక్సెస్‌ అయితేనే డిస్ట్రిబ్యూటర్లు లాభంను పొందగలరు. ఒక వేళ సినిమా ఫ్లాప్‌ అయితే అజ్ఞాతవాసి డిస్ట్రిబ్యూటర్లకు ఆదుకున్నట్లుగా ఆదుకోవాల్సి వస్తుంది. అప్పుడు నిర్మాతకు పెద్దగా లాభాలు ఉండవు. అందుకే ఈసారి ఎన్టీఆర్‌తో చేయబోతున్న సినిమాకు 100 కోట్ల కలెక్షన్స్‌ రావాలనే పట్టుదలతో త్రివిక్రమ్‌ కాస్త ఆలస్యం అయినా కూడా పక్కా స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్నాడు.