నూతన్‌ నాయుడు ఔట్‌.. మళ్లీ కౌశల్‌ ఒంటరి…!

Nutan Naidu Is Again Leaving The Big Boss Home

తెలుగు బిగ్‌బాస్‌ రెండవ సీజన్‌లో సామాన్యుడిగా ఎంట్రీ ఇచ్చిన నూతన్‌ నాయుడు నెత్తిన దరిద్రం తాండవిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఎంట్రీ ఇచ్చిన రెండవ వారమే చిన్న చిన్న కారణాల వల్ల ఎలిమినేట్‌ అయ్యాడు. ప్రేక్షకులు నూతన్‌ నాయుడు ఇంట్లో బాగుండేది అనుకున్నారు. ఆ సమయంలోనే అనుకోని అవకాశంగా బిగ్‌బాస్‌ షో నిర్వాహకులు ఎలిమినేట్‌ అయిన వారిలో మళ్లీ ఒకరిని ఇంట్లోకి పంపించే అవకాశం ఉంది అంటూ ప్రకటించడం, దాంతో కౌశల్‌ ఆర్మీ మద్దతుతో నూతన్‌ నాయుడు ఇంట్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం చకచక జరిగి పోయాయి. నూతన్‌ నాయుడు రెండవ సారి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి ఫైనల్‌ వరకు వెళ్లే అవకాశం ఉందని కౌశల్‌ ఆర్మీ భావిస్తున్న సమయంలో అనూహ్యంగా అనారోగ్యం కారణంగా ఇంటి నుండి బయటకు వెళ్లవల్సిన పరిస్థితి ఏర్పడినది.

nuthan

నూతన్‌ నాయుడుకు గతంలోనే చేయి ప్యాక్చర్‌ అయ్యిందట. తాజాగా కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా నూతన్‌ నాయుడు కౌశల్‌కు మద్దతుగా ఆడుతున్న స మయంలో మరోసారి ఆ ప్యాక్చర్‌ ఇబ్బందిగా మారింది. కన్ఫెషన్‌ రూంలో డాక్టర్‌ నూతన్‌ నాయుడును చూసి తప్పకుండా హాస్పిటల్‌కు వెళ్లాల్సిందే అని చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నూతన్‌ నాయుడు ఇంట్లోంచి బయటకు వెళ్లవల్సి వచ్చింది. కౌశల్‌కు మద్దతుగా ఉంటాడు అని నూతన్‌ నాయుడును కౌశల్‌ ఆర్మీ పంపించడం జరిగింది. కాని ఇప్పుడు కౌశల్‌ను మళ్లీ ఒంటరి వాడిని చేసి నూతన్‌ నాయుడు బయటకు వచ్చేశాడు. కౌశల్‌ ఆర్మీతో నూతన్‌ నాయుడు ఖచ్చితంగా ఫైనల్‌ వరకు వెళ్లే అవకాశం ఉండేది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నూతన్‌ నాయుడు ఇలా రెండు సార్లు చిన్న కారణాల వల్ల బయటకు రావడం ఆయన దురదృష్టంగా చెప్పుకోవచ్చు. నూతన్‌ నాయుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం దాదాపుగా లేదని సమాచారం అందుతుంది.

Nutan Naidu Is Again Leaving The Big Boss Home