Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
గత ఏడాది ఓ మహిళ టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు మీద వేధింపుల కేసు పెట్టిన మహిళ మీకందరికీ గుర్తుండే ఉంటుంది. కర్నాటక రాష్ట్రానికి చెందిన ఓ మహిళా ప్రజాప్రతినిధిని వేధించిన కేసులో తాను నామాని నిలదీయడంతో తన పట్ల బూతు పురాణం మొదలు పెట్టాడని సుజాత అప్పట్లో ఆమె ఆరోపిస్తూ నామాతో పాటు ఆయన సోదరుడు సీతయ్య మీద కూడా కేసు నమోదు చేసింది. తనతో మూడేళ్లుగా నామా స్నేహంగా ఉండేవారని ఒంటరిగా ఉంటున్న నా ఇంటికి తరచుగా వస్తూ ఉండేవారని, అయితే కర్నాటకలో మాజీ ఎమ్మెల్సీని లైంగిక వేధించి, పెళ్లి చేసుకుంటానని చెప్పి నామా నాగేశ్వరరావు మోసం చేసిన విషయం తెలియగానే ఆమే నామాని నిలదీసింది.
దీంతో మరో సారి ఈ విషయాలు మరలా మాట్లాడితే తన నగ్న చిత్రాలను బయటపెడుతానంటూ నామా వేధిస్తున్నారని ఆమె కేసు పెట్టారు. అప్పటిలో ఈ కేసు సంచలనం అయ్యింది. ఆడవాళ్లను మోసం చేస్తున్న నామాపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేశారు. కానీ ఏమయిందో ఏమో అప్పటి కేసు తర్వాత ఆ విషయం అందరూ మరచిపోయినట్టు ఉన్నారు, అయితే ఇప్పుడు తాజాగా ఆ మహిళ ఎవరయితే అప్పుడు నామా మీద కేసు వేశారో ఆమె భర్తే కేసు పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని విడాకులిప్పించి ఆయనతోనే ఉండాల్సిందిగా నామా వేధిస్తున్నారని అమెరికా లో ఉండే రామకృష్ణన్ ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన ఫిర్యాదు ప్రకారం జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 45లో నివసించే సుజాత, రాధాకృష్ణన్ భార్యభర్తలు వారు ఉపాధి నిమిత్తం 2004లో అమెరికా వెళ్లారు.
అయితే కొన్నాళ్ళకి సుజాత పిల్లలతో కలిసి తిరిగి నగరానికి వచ్చింది. ఇక్కడే తమ జూబ్లీహిల్స్ నివాసంలోనే పిల్లలని చదివిస్తూ ఉంది. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా సుజాతకు నామా నాగేశ్వరరావు, ఆయన సోదరుడు సీతయ్యతో పరిచయం ఏర్పడింది. బిజినెస్ కూడా చేసే ఉద్దేశ్యాలు ఉండటంతో వీరి మధ్య సన్న్హిత్యం పెరిగింది. అయితే 2017లో నామా నాగేశ్వరరావు తనను మోసం చేశాడంటూ, బ్లాకు మెయిల్ చేస్తున్నాడంటూ సుజాత జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం అప్పట్లో సంచలనం సృష్టించింది. సుజాత భర్త రాధాకృష్ణన్ రెండు రోజుల క్రితమే అమెరికా నుంచి వచ్చారు.
నామా నాగేశ్వరరావుతో ఉన్న సంబంధాల గురించి భార్యను నిలదీశారు. ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ తనకు నామాతో 2013 నుంచి వివాహేతర సంబంధం గురించి చెప్పిందన్నారు. భర్తకు విడాకులిచ్చి తనతోపాటు ఉండాల్సిందిగా నామా ఒత్తిడి తెస్తున్నాడని, భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆమె చెప్పిందని అందుకే నామా నాగేశ్వరరావు తనను మోసం చేశాడని ఆయన సోదరుడు సీతయ్య బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశానని అన్నారు. ఈ మేరకు పోలీసులు నామా నాగేశ్వరరావుపై ఐపీసీ 407, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏడాది క్రితం కేసుని నీరు గార్చిన పోలీసులు ఇప్పటికయినా ఆ కేసు ని సీరియస్ గా తీసుకుని ఒక పరిష్కారం చుపుతారేమో చూడాలి మరి. ఇప్పటికే కేసీఆర్ దెబ్బకి తెలంగాణాలో అంతతంత మాత్రంగా ఉన్న తెలుగుదేశం ఇమేజ్ కి ఈ నామా కేస్ పెద్ద డ్యామేజ్ గానే చెప్పుకోవచ్చు.