ప్రపంచంలో ఎక్కడున్నా.. భారతీయులందరూ ఆగస్టు 15 వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా పండుగలాగా జరుపుకుంటారు.ఎందుకు అంటే బ్రిటిష్ వారి పాలనా నుండి బానిస బతుకులకి స్వస్తి పలికిన రోజు. వారి నుండి మనకి స్వేచ్ఛ రావడానికి స్వాతంత్ర్యం కోసం ఎందరో పోరాటం చేశారు. తమ పోరాట పటిమను, తెగువను చూపించారు ప్రాణాలను సైతం పణంగా పెట్టారు భారత స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించారు.
మనకి చాలామంది ఎంతరో స్వాతంత్ర్య సమరయోధులు తెలిసి ఉండొచ్చు. కానీ.. ఈ భారత మహిళలు కూడా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ల పోరాట పటిమ తెలుసా? మహిళలు అయినప్పటికీ తెగించి బ్రిటీషర్లతో పోరాడారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వాములయ్యారు.వారిలో కొంత మంది చరిత్రలో నిలిచిపోయారు. అందులో భాగంగా సరోజినీ నాయుడు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. సరోజినీ నాయుడు
హైదరాబాద్‌లోని నిజాం కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసిన బెంగాలీ బ్రాహ్మణుడు అఘోరేనాథ్ ఛటోపాధ్యాయ పెద్ద కుమార్తె సరోజిని ,హైదరాబాద్ లోని బెంగాళీ బ్రాహ్మణ కుటుంబంలో 1879 ఫిబ్రవరి 13న సరోజినీ నాయుడు జన్మించారు. సరోజినీ నాయుడుకు భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా)అనే బిరుదు కూడా ఉంది. స్వాతంత్ర్య సమర యోధురాలు, కవయిత్రి అలాగే ఆమె అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహా సభలకు మొదటి మహిళా అధ్యక్షురాలు, అంతేకాకుండా స్వతంత్ర భారత తొలి మహిళా గవర్నర్ కూడా . భారత దేశం స్వేచ్ఛ పోరాటంలో ఆమె పాత్ర . శాసనోల్లంఘన ఉద్యమం , క్విట్ ఇండియా ఉద్యమంలో ఆమె చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది, దాని కోసం ఆమె జైలు శిక్ష కూడా అనుభవించింది. ఆమె అనేక నగరాలకు వెళ్లి మహిళా సాధికారత, సామాజిక సంక్షేమం మరియు స్వేచ్ఛ యొక్క ప్రాముఖ్యత గురించి ప్రసంగించి చైతన్య పరిచేవారు. 1924లో ఆమె భారతీయుల ప్రయోజనాల కోసం తూర్పు ఆఫ్రికా మరియు దక్షిణాఫ్రికాలో పర్యటించారు భారతదేశంలో ఆమె బ్రిటీష్ వ్యతిరేక కార్యకలాపాలు ఆమెకు అనేక జైలు శిక్షలు అనుభవిచారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతనే ఆమె కన్నుమూశారు. ఆమ చేసిన పోరాటం ప్రతీ రాష్ట్రంలో స్కూళ్లలో పాఠాలుగాఉంది.